'బాహుబలి'పై ఫోకస్ అహ్మదాబాద్ ఐఐఎం

- January 28, 2018 , by Maagulf
'బాహుబలి'పై ఫోకస్ అహ్మదాబాద్ ఐఐఎం

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ర్టీలో చరిత్ర సృష్టించిన 'బాహుబలి'పై ఫోకస్ పెట్టింది అహ్మదాబాద్ ఐఐఎం. ఇప్పుడు బాహుబలి సిరీస్‌పై స్టూడెంట్స్ రీసెర్చ్ చేయనున్నారు. ఆర్ట్, బిజినెస్, టెక్నాలజీ కలసి మూవీ అఖండ విజయానికి ఎలా దోహదపడ్డాయనే దానిపై అధ్యయనం జరగాలన్నారు విజిటింగ్ ఫ్యాకల్టీ భరతన్‌ కందస్వామి. ఐఐఎం సెకండ్ ఇయర్ స్టూడెంట్స్‌కు 'మేనేజ్‌మెంట్‌'పై నిర్వహించే స్పెషల్ కార్యక్రమంలో 'బిజినెస్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ర్టీ' అంశంగా ఇవ్వనున్నారు. బాహుబలి ఓ గొప్ప చిత్రమని, ఆర్ట్, బిజినెస్, టెక్నాలజీ మేళవింపుతో ఘన విజయం సాధించిందన్నారు.

చాలా సినిమాలు సృజనత్మాకంగా, కళాత్మకంగా ఉంటాయేతప్ప బిజినెస్‌ని చేయలేవని, కొన్ని సందర్భాల్లో టెక్నాలజీని ఉపయోగించుకోలేవని పేర్కొన్నారు. స్టోరీ గొప్పగా ఉండవచ్చని, దాని అమలు అంతంత మాత్రంగానే వుంటుందని, కానీ, బాహుబలి విషయానికి వచ్చేసరికి అన్నీ కలగలిసి వున్నాయని చెప్పారు. అందుకే బాహుబలి అంతటి విజయాన్ని సాధించిందన్నారు. ఓ ప్రత్యేక కోర్సుగా ఎంపిక చేసిన తర్వాత సదరు విద్యార్థులు లోతైన అధ్యయనం చేస్తారు. ఈ ప్రక్రియ అంతా నాలుగునెలల్లో పూర్తి కానుంది.

భారత చలనచిత్ర పరిశ్రమ వ్యాపారంపై కూడా దృష్టిపెడతారు. స్కిప్ట్, పోస్ట్ ప్రొడక్షన్స్, ఫిల్మ్ ఫైనాన్స్, ఫండ్ రైజింగ్, మార్కెటింగ్, డిస్టిబ్యూషన్, ప్రమోషన్ వంటి వాటిపై కూడా ఫోకస్ పెట్టనున్నారు. రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఓవరాల్‌గా రూ.1000 కోట్లు రాబట్టిన విషయం తెల్సిందే!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com