హయ్యర్ చదువుల కోసం లండన్ వెళ్లి విద్యార్థి అదృశ్యం
- January 28, 2018
మేడిపల్లి: తమ కుమారుడు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తానంటే తల్లిదండ్రులు సంతోషించారు. కాయాకష్టం చేసి ఆర్థికంగా ఆసరాగా నిలిచారు. లండన్‌లో ఉన్నత చదువులు పూర్తి చేసుకుని ఉన్నతంగా ఎదగాలని ఆశించారు. మూడేళ్ల నుంచి కుమారుడి సమాచారం తెలియక కన్నీరు మున్నీరవుతున్నారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కాచారం గ్రామానికి చెందిన రాపర్తి వెంకటి, భూమక్కల మూడో కుమారుడు రమేశ్ (34) ఏడో తరగతి వరకు ఊళ్లోనే చదువుకున్నాడు. హైదరాబాద్‌లో డిగ్రీ పూర్తి చేసి ఎంబీఏ చదివేందుకు 2009లో లండన్ వెళ్లాడు. ఏడాది పాటు ఎంబీఏ చదివి 2011 డిసెంబరు వరకు గడువు ముగిసే వీసా పొందిన రమేశ్ 2015 వరకు తమతో ఫోన్‌లో మాట్లాడినట్లు తండ్రి వెంకటి తెలిపారు. అనంతరం తమతో కనీసం ఫోన్‌లో మాట్లాడక పోవడంతో ఆవేదన చెందుతున్నట్లు పేర్కొన్నారు. రమేశ్ అన్నయ్య గంగాధర్ ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లగా మరో సోదరుడు గణేష్ ప్రైవేటు ఉపాధ్యాయునిగా కరీంనగర్‌లో స్థిరపడ్డారు. దుస్తులు కుట్టుకుని జీవించే వెంకటి కుటుంబంలో మరో ఇద్దరు ఆడపిల్లలు ఉండగా వారికి పెళ్లిల్లు చేశారు. తమ కుమారుడు కనిపించడం లేదని పలువురికి విన్నవించామని తల్లిదండ్రులు చెప్పారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయమై స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







