నేటి నుంచి ఇండియా ఓపెన్ స్టార్ట్
- January 29, 2018
హైదరాబాద్: ఇండోనేషియా ఓపెన్ టోర్నీ ముగిసి రెండు రోజులైందో లేదో అప్పుడే మరో టోర్నీ సిద్ధమైపోయింది. ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీకి రంగం సిద్ధమైంది. ఈ టోర్నీలో స్వదేశ ఆటగాళ్లైన సింధు, సైనాపైనే అందరి కళ్లు ఉన్నాయి. నేటి నుంచి జరిగే ఈ టోర్నీలో భారత టాప్ షట్లర్లందరూ బరిలోకి దిగుతున్నారు. సైనా నెహ్వాల్, పీవీ సింధు ఫేవరెట్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
మంగళవారం ప్రారంభంకానున్న ఈ టోర్నీలో సింధు టాప్ సీడ్‌గా, సైనా నాలుగో సీడ్‌గా పాల్గొంటున్నారు. 2015లో విజేతగా నిలిచిన సైనా.. ఇండోనేషియా మాస్టర్స్‌లో ఫైనల్ చేరడంతో ఆమెపై అంచనాలు పెరిగాయి.
రియో ఒలింపిక్స్ తర్వాత ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బందిపడిన సైనా దాన్ని అధిగమించినట్లే కనిపిస్తున్నది. ఇండోనేసియా మాస్టర్స్‌లో రన్నరప్‌గా నిలువడమే ఇందుకు నిదర్శనం. నాలుగోసీడ్గా బరిలోకి దిగుతున్న సైనా.. తొలిరౌండ్లో సోఫీ డాహ్ (డెన్మార్క్)తో తలపడనుంది.
గతేడాది ఇండియా ఓపెన్ టైటిల్‌తో సత్తాచాటిన సింధు తొలి రౌండ్లో నటాలియా రోడ్ (డెన్మార్క్)తో పోటీపడుతుంది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సోఫీ డాల్ (డెన్మార్క్)తో సైనా తలపడుతుంది. క్వార్టర్స్‌లో సింధు ఐదోసీడ్ బీవెన్ జాంగ్‌ను ఎదుర్కోవచ్చు.
క్వార్టర్‌ఫైనల్ వరకు సులువైన డ్రానే ఉన్నా.. సెమీస్‌లో మాత్రం మాజీ ప్రపంచ చాంపియన్ రచనోక్ ఇంతనోన్‌తో కఠిన పరీక్ష ఎదురుకానుంది. డ్రా ప్రకారం సెమీస్ వరకు ప్రత్యర్థుల్ని ఓడిస్తే.. సైనా, సింధు ఫైనల్లో ఎదురుపడతారు.
శ్రీకాంత్‌పైన భారీ అంచనాలు:
గత సీజన్లో నాలుగు టైటిల్స్ నెగ్గి సంచలనం సృష్టించిన కిడాంబి శ్రీకాంత్‌పై ఈసారి భారీ అంచనాలు నెలకొన్నాయి. కాలి గాయంతో చైనా ఓపెన్, హాంకాంగ్ ఓపెన్‌కు దూరంగా ఉన్న అతను దుబాయ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో సత్తా చాటలేకపోయాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు ఈనెలలో జరిగిన ఇండోనేసియా మాస్టర్స్‌కూ దూరంగా ఉన్నాడు.
2014లో విజేతగా నిలిచిన శ్రీకాంత్.. శుభారంభంతో సీజన్‌ను మొదలుపెట్టాలని భావిస్తున్నాడు. లీ చియుక్ యీ (హాంకాంగ్)తో జరిగే మ్యాచ్‌తో అతను టోర్నీని మొదలుపెట్టనున్నాడు. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ శ్రీకాంత్ గెలిస్తే.. ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ విక్టర్ అక్సెల్సన్తో తలపడే అవకాశాలున్నాయి. సాయి ప్రణీత్, హెచ్ఎస్ ప్రణయ్, పారుపల్లి కశ్యప్, అజయ్ జయరామ్, సౌరభ్ వర్మ, సమీర్ వర్మ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







