మరింత సరళతరం కానున్నపాస్పోర్టు సేవలు
- January 29, 2018
తత్కాల్ సేవలకు గ్రూప్‌వన్ అధికారి ధృవీకరణ పత్రం నుంచి మినహాయింపు రాష్ట్రంలో మరో ఐదు పోస్టాఫీసుల్లో పాస్పోర్ట్సేవా కేంద్రాలు: పాస్‌పోర్ట్ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి కంటోన్మెంట్, నమస్తే తెలంగాణ: పాస్‌పోర్ట్ సేవలను మరింత సరళతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణ యం తీసుకున్నదని హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయ పాస్‌పోర్ట్ అధికారి డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. తత్కాల్ పాస్‌పోర్ట్‌లకు సంబంధించి ఇకపై గ్రూప్‌వన్ అధికారి ధృవీకరణ పత్రం లేకుండానే జారీ చేసే వెసులుబాటు కల్పించిందన్నారు. సోమవారం సికింద్రాబాద్‌లోని పాస్‌పోర్ట్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తత్కాల్ పద్ధతిలో దరఖాస్తు చేసుకునేవారు ఆధార్ కార్డు లేదా ఎన్రోల్ చేసిన పత్రం, సెల్ఫ్ డిక్లరేషన్ అనెక్సరీ-ఈతోపాటు నిర్దేశించిన 12 డాక్యుమెంట్ల (ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసె న్స్, పాన్‌కార్డు, ఆయుధ లైసెన్స్, ఎస్సీ, ఎస్టీ కులం సర్టిఫికెట్, ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల గుర్తింపు కార్డు, బ్యాంక్, కిసా న్, పోస్టాఫీస్ పాస్‌బుక్, స్టూడెంట్ గుర్తింపు కార్డు, పుట్టినతేదీ, పెన్షన్పత్రం, సెల్ఫ్ పాస్‌పోర్ట్, రేషన్‌కార్డు)ల్లో ఏవైనా రెండింటితో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ విధానంలో దరఖాస్తు చేస్తే ముందస్తు పోలీస్ వెరిఫికేషన్ లేకుండానే మూడు రోజుల్లో పాస్‌పోర్ట్ జారీ చేస్తామన్నారు. ఔట్ ఆఫ్ టర్న్ ఇష్యూ ఆఫ్ ప్రెస్ పాస్‌పోర్ట్ అండర్ నార్మర్ స్కీం ద్వారా అదనంగా తత్కాల్ ఫీజు చేల్లించకుండానే పాస్‌పోర్ట్‌లను జారీ చేస్తామన్నారు. ఈ విధా నం ద్వారా దరఖాస్తు చేసుకున్న ప్రెస్ పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు ముందస్తు పోలీస్ వెరిఫికేషన్ లేకుండానే మూడు నుంచి వారం రోజుల్లో జారీ చేస్తామన్నారు. ఈ దరఖాస్తుదారులు తత్కాల్ స్కీంకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను సమార్పించాల్సి ఉంటుందన్నారు.
పాస్‌పోర్ట్‌ల జారీలో హైదారాబాద్ టాప్
దేశంలో పాస్‌పోర్ట్‌ల జారీలో హైదరాబాద్ కార్యాలయం మొదటి స్థానంలో నిలిచిందన్నా రు. మూడేండ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్నామన్నారు. 2017లో దేశవ్యాప్తంగా 1.17 కోట్ల పాస్‌పోర్ట్‌లు జారీ అవగా హైదరాబాద్ నుంచి 5.87 లక్షల పాస్‌పోర్ట్‌లు జారీ చేశామన్నారు. వరంగల్, మహబూబ్‌నగర్‌లోని పోస్టల్ పాస్‌పోర్ట్ సేవాకేంద్రాల ద్వారా 15,476 దరఖాస్తులు వచ్చాయన్నారు.
ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో మెదక్, నల్లగొండ, ఖమ్మం, సిద్దిపేట, ఆదిలాబాద్ జిల్లాల్లో పోస్టల్ పాస్‌పోర్ట్ సేవాకేంద్రాలను అందుబాటులోకి తెస్తామన్నారు. హైదరాబాద్‌లో విదేశీభవన్‌ను నిర్మించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నదని, రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్వేషణలో ఉన్నదన్నారు. గతేడాది మాదిరిగానే త్వరలో పాస్‌పోర్ట్ మేళాలు, అదాలత్‌లు నిర్వహిస్తామని వివరించారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు
- CBSE బోర్డ్ ఎగ్జామ్స్: ఆఖరి 3 వారాల స్మార్ట్ రివిజన్ ప్లాన్..
- మేడారంలో భక్తజన సంద్రం
- మేనేజర్ నైపుణ్యం పై ఫిర్యాదు చేయవచ్చా?
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్..
- దోహా మ్యూజిక్ లవర్స్ ఆధ్వర్యంలో రిథమ్ రైజ్‌తో గానం & నృత్య పోటీలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు







