సూర్యకి విలన్‌గా టాలీవుడ్ సీనియర్ స్టార్ జగపతిబాబు
- January 29, 2018
‘గ్యాంగ్’ సినిమాతో మరో విజయాన్ని అందుకున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, ప్రస్తుతం సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాలో ఓ టాలీవుడ్ సీనియర్ నటుడు ప్రతినాయక పాత్రలో నటించనున్నాడట. లెజెండ్ సినిమాతో విలన్ గా మారిన సీనియర్ హీరో జగపతి బాబు, తెలుగుతో పాటు మాలీవుడ్, కోలీవుడ్‌లలోనూ వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. ఇప్పటికే తమిళ నటుడు విజయ్ హీరోగా తెరకెక్కిన ‘భైరవ’, రజనీకాంత్ ‘లింగా’ సినిమాలలో విలన్‌గా నటించిన జగ్గుభాయ్.. మరో తమిళ హీరో సూర్య నెక్ట్స్ సినిమాలోనూ ప్రతినాయక పాత్రలో నటించనున్నాడు.
రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ పాత్రలో ప్రముఖ నటుడు అవసరమని భావించిన చిత్రయూనిట్ జగపతిబాబును సంప్రదించారు. క్యారెక్టర్ నచ్చటంతో ఆయన కూడా ఓకె చెప్పారన్న టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతానికి జగపతిబాబు నటించటంపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. సూర్య సరసన రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవిలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి రెండో వారంలో రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







