క్షమాబిక్ష కాలం మొదలుకావడంతో ప్రవాసులతో కువైట్ రాయబార కార్యాలయం
- January 30, 2018
కువైట్:సోమవారం తెల్లవారుజామున 4 గంటలకే కువైట్ లోని భారత దౌత్య కార్యాలయం(ఎంబసీ) వద్ద వేలాదిమంది బారులు తీరేరు. ఒక్కసారిగా వేలాది మంది రావడంతో దౌత్య కార్యాలయ అధికారులతోపాటు కువైత్ అధికారులు విస్తుపోయారు. కువైత్లో పనులకు మన దేశం నుంచి సుమారు 40 సంవత్సరాలుగా భారీగా ప్రజలు తరలివెళ్తున్నారు. కువైట్ లో వివిధ వృత్తుల్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాలకు చెందినవారే సుమారు 5 లక్షల మంది వరకు అక్కడ ఉంటున్నారు.అయితే ఏజెంట్లు, దళారులు, అక్కడి యజమానుల మోసాల వల్ల వేలాదిమంది అకామా, పాస్పోర్టు, ఆ దేశ గుర్తింపు కార్డు బతాకా కూడా లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనుమతి పత్రాలు లేని సుమారు 50 వేల మందికిపైగా తెలుగు రాష్ట్రాల ప్రజలు అక్కడ ఉన్నట్టు సమాచారం. పాస్పోర్టు, అకామా, బతాకా లేకుండా ఆ దేశంలో చట్టవిరుద్ధంగా ఉన్న వారు అపరాధరుసుము, శిక్షలు లేకుండా ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 22వ తేదీ వరకు స్వదేశాలకు వెళ్లిపోయేందుకు అనుమతి ఇస్తూ కువైత్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అవకాసంతో ఇల్లు చేరేందుకు మన దేశానికి చెందిన అలాంటివారంతా మన ఎంబసీ వద్ద బారులు తీరుతున్నారు. తొలిరోజు(సోమవారం) భారీగా భారత దౌత్య కార్యాలయం ఎదుట వేలాదిమంది క్యూ కట్టారు. వారిలో ఎక్కువగా మహిళలు ఉన్నారు. ఆ దేశ అనుమతి పత్రాలు లేని వారు మన దౌత్య కార్యాలయానికి వెళ్లి తమ వద్ద ఉన్న పత్రాలు సమర్పిస్తే, అన్ని వివరాలు పరిశీలించి భారత్కు రావడానికి అధికారులు అనుమతి ఇస్తారు. అవుట్పాస్ జారీ చేస్తారు.ఈ అవుట్పాస్ను ఇమిగ్రేషన్ కార్యాలయంలో ఇస్తే, కువైట్ లో కేసులేమీ లేనట్టు ధ్రువీకరించుకొని ఇమిగ్రేషన్ ముద్ర వేసి, విమాన టికెట్ తీసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా వారం రోజుల్లో పూర్తి కానుంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







