వాస్తవ జీవితాలకు దగ్గరగా 'బియాండ్ ద క్లౌడ్స్' సినిమా
- January 30, 2018
కథలతో ఓ బలమైన ముద్ర వేసే దర్శకులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. కళే గర్వపడే సినిమాలు తీస్తున్నవారూ ఉన్నారు. ఇలాంటి వారిలో మాజిద్ మాజిద్ ఒకరు. ఈయన ఇరానియన్ డైరెక్టర్. ఫస్ట్ టైమ్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. బియాండ్ ద క్లౌడ్స్ అంటూ రూపొందుతోన్న ఈ మూవీ ట్రైలర్ ప్రతి ఒక్కరినీ మెస్మరైజ్ చేస్తోంది. హృదయాలకు హత్తుకునేలా ఉన్న ఈ కథలో ఓ నిజాయితీ... వాస్తవ జీవితాలకు దగ్గరితనం కనిపిస్తోంది.
చిల్డ్రన్ మూవీస్ తో హార్ట్ బ్రేకింగ్ మూవీస్ తీయడంలో మాజిద్ కు వాల్డ్ వైడ్ గా తిరుగులేని గుర్తింపు ఉంది. ఆయన తీసిన చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ అనే సినిమా బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో అకాడెమీ అవార్డ్ అందుకుంది. అకాడెమీ అవార్డ్ కు నామినేట్ అయిన తొలి ఇరానియన్ మూవీ కూడా ఇదే కావడం విశేషం. ఇతని ప్రతిభ తెలిసిన చైనా ప్రభుత్వంలోని బీజింగ్ గవర్నమెంట్ ఆయనతో ఓ డాక్యుమెంటరీ చేయించింది. 2008లో చైనా, బీజింగ్ లో జరిగిన ఒలిపింక్స్ వేదికగా ఆయన డాక్యుమెంటరీని విజన్ బీజింగ్ పేరిట ప్రదర్శించారు. మొత్తంగా మాజిద్ కు ఆస్కార్ రాలేదు కానీ.. ఆ స్థాయి దర్శకుడని ప్రపంచ వ్యాప్తంగా పేరుంది.
దర్శకుడుగా ఇండియాలో డెబ్యూ మూవీతోనే ది బెస్ట్ ఇంప్రెషన్ వేస్తున్నాడు మాజిద్. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన కుర్రాడు.. ఎలాగైనా బాగా సంపాదించాలని అడ్డదారిలో డ్రగ్స్ సరఫరా చేస్తూ ధనవంతుడు కావాలనే ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. తనను చిన్నతనం నుంచి చేరదీసిన తార అనే ఓ అమ్మాయిని ఇష్టపడే ఈ కుర్రాడు చివరికి పోలీస్ లకు చిక్కుతాడు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో అతను దాచిన డ్రగ్స్ తార వద్ద దాచిపెడతాడు. అవి కాస్తా పోలీస్ లకు దొరుకుతాయి. దీంతో తారను అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అనేదే ఈ కథ. మాగ్జిమం టీనేజ్ కుర్రాళ్లనే ప్రధాన పాత్రలకు తీసుకున్నాడు దర్శకుడు మాజిద్.
ఇక ఈ బియాండ్ ది క్లౌడ్స్ కు బిగ్గెస్ట్ అస్సెట్ ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్. ట్రైలర్ లోనే ఆయన సంగీతం మెస్మరైజ్ చేస్తోంది. ఎందుకంటే రెహ్మాన్ కు మంచి కథ పడితే దానికి తన సంగీతంతో సరికొత్త ఎత్తులకు తీసుకువెళతాడు. మొత్తంగా ట్రైలర్ తోనే అద్భుతమైన ఇంపాక్ట్ వేసిన ఈ ఆస్కార్ రేంజ్ డైరెక్టర్ ఇండియన్ ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ సాధిస్తాడో చూడాలి.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక