పన్ను ఎగ్గొట్టిన అమలాపాల్ అరెస్ట్ చేసిన కేరళ పోలీసులు
- January 30, 2018
ఖరీదైన కారు కొని పన్ను ఎగ్గొట్టేందుకు ప్రయత్నించిన కేసులో అమలాపాల్‌ను కేరళ క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేరళలో నివాసం ఉంటున్న అమల గతేడాది కోటి రూపాయల విలువైన ఖరీదైన కారును కొనుగోలు చేశారు. ఆమె కేరళ నివాసి అయినప్పటికీ పుదుచ్చేరిలో నకిలీ ఆధారాలను సమర్పించి లగ్జరీ కారును రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే కారు రిజిస్ట్రేషన్ సమయంలో రూ.20లక్షల మేర పన్ను ఎగవేసినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదం సంబందించి కేరళలో అమలఫై కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన కేరళ హైకోర్టు...క్రైమ్‌బ్రాంచ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవాలని అమలకు సూచించింది.దీనితో ఆమె తిరువనంతపురం క్రైమ్‌బ్రాంచ్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది . అయితే కేసు తీవ్రత తక్కువ ఉన్న దృష్ట్యా వెంటనే బెయిల్ లభించడంతో ఆమె విడుదలైంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







