లండన్లో ప్రవాస భారతీయ ఉద్యోగుల నిరసనలు
- January 31, 2018
లండన్ : బ్రిటన్ రాజధాని లండన్లో ప్రవాస భారతీయ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. బ్రిటన్ ప్రభుత్వం రద్దు చేసిన ద టయర్-1 ( జనరల్) వీసాలను పునరుద్ధరించకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు వందలాది మంది నిరసనకారులు డౌనింగ్ స్ట్రీట్కు చేరుకొని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఆందోళనలో డాక్టర్లు, ఐటీ ఇంజినీర్లు, ఉపాధ్యాయులు తదితర ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రస్తుత బ్రిటన్ ప్రధాని థెరిసా మే 2011లో బ్రిటన్ రక్షణ మంత్రిగా పనిచేశారు. నైపుణ్యమున్న ఉద్యోగులకు బ్రిటన్ ప్రభుత్వం మంజూరు చేస్తూ వస్తున్న ద టయర్ 1( జనరల్ ) వీసా విధానాన్ని ఆమె రద్దు చేశారు. ఈ విషయమై అప్పట్లో బ్రిటన్లో నిరసనలు వెల్లువెత్తాయి. బ్రిటన్ ప్రభుత్వం నేటికీ ద టయర్-1 వీసాలను పునరుద్ధరించడంగానీ, పొడిగించడం కానీ చేయకపోవడంతో భారత్ సహా పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశస్థులు ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద టయర్-1 వీసాల పొడిగింపు లేకపోవడం, నైపుణ్యమున్న ఉద్యోగులకు తగిన ప్రోత్సాహం లభించకపోవడంతో బ్రిటన్లో నివసిస్తున్న ప్రవాస భారతీయుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. వేలాది కుటుంబాలు బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. బ్రిటన్ ఆర్థికాభివృద్ధి కోసం పన్నులు చెల్లించి తామంతా పాటుపడుతున్నప్పటికీ ప్రభుత్వం తమను ఇబ్బందులకు గురిచేస్తోందని భరద్వాజ్ అనే నిరసనకారుడు తన ఆవేదనను వెలిబుచ్చాడు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







