కరంజ్ జలాంతర్గామి లాంచ్ చేసిన నావికాదళం
- January 31, 2018
ముంబయి: భారత నావికాదళంలో స్కార్పీన్ శ్రేణికి చెందిన మూడో జలాంతర్గామి ఐఎన్‌ఎస్ కర్నాజ్ జలప్రవేశం చేసింది. నేవీ చీఫ్ అడ్మైరల్ సునీల్ లంబా సతీమణి రీనా లంబా జలాంతర్గామిని ప్రారంభించారు. నావికాదళంలోకి చేర్చడానికి ముందు ఏడాది పాటు ఈ జలాంతర్గామిని క్షుణ్ణంగా పరీక్షించనున్నట్లు సునీల్ లంబా వెల్లడించారు. దీనిని ముంబయిలోని మజగావ్ డాక్‌యార్డ్‌లో నిర్మించారు. మొత్తం ఆరు జలాంతర్గాములను నిర్మించనున్నట్లు తెలిపారు. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ నౌకల తయారీ సంస్థ డీసీఎన్ఎస్ భాగస్వామ్యంతో జలాంతర్గాములను నిర్మిస్తున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ స్కార్పీన్ తరగతికి చెందిన కలవరి జలాంతర్గామిని నావికాదళంలోకి ప్రవేశపెట్టారు.
తాజా వార్తలు
- 2026: అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026
- అజ్మాన్ 'అబ్రా'కు పెరిగిన క్రేజ్
- రేపు సిట్ ముందుకు కేసీఆర్..
- యూఏఈ సరికొత్త చట్టం
- ఇజ్రాయెల్‌తో ట్రంప్ రాజీ..
- చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్
- ఇరాన్ అధ్యక్షుడితో అమీర్ చర్చలు..!!
- అల్ హదీథా బార్డర్ వద్ద స్మగ్లింగ్ గుట్టురట్టు..!!
- యూఏఈలో ఫిబ్రవరి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- కువైట్-ఢిల్లీ ఫ్లైట్ కు బాంబు బెదిరింపు..!!







