ఏరోప్లేన్ లో నెమలి గెటౌట్
- January 31, 2018
తనతోపాటు తన పెంపుడు పక్షి నెమలిని కూడా తీసుకెళ్లాలని ఎయిర్‌పోర్టుకి వచ్చింది ఓ మహిళ. నెమలి మరింత పెద్దదిగా వుండడంతో ఎయిర్‌లైన్స్ సిబ్బంది నెమలిని విమానంలోకి ఎక్కించుకోవడానికి అంగీకరించలేదు. నెమలికి కూడా టికెట్ తీశానని, ఎమోషనల్ సపోర్ట్ ఎనిమల్ రూల్స్ ప్రకారం తన పక్షిని విమానంలో తీసుకెళ్లే హక్కుందని కూడా ఆర్గ్యుమెంట్ చేసింది. ఐనా అధికారులు ససేమిరా అన్నారు.
మీరు చెప్పిన నిబంధల ప్రకారం జంతువులను విమానంలో తీసుకెళ్లడానికి పర్మిషన్ వుందని, కాకపోతే ఈ నెమలి నిబంధనలకు అనుగుణంగా లేదని, సైజు, బరువు చాలా ఎక్కువగా ఉందని తోసి పుచ్చారు. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఆ మహిళ టికెట్ మనీని వెనక్కి ఇవ్వడంతోపాటు ఎయిర్‌పోర్టు నుంచి హోటల్‌కు వెళ్లడానికి అయ్యే ఖర్చు కూడా చెల్లించింది. న్యూజెర్సీలోని నీవార్క్ లిబర్టీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఈ ఘటన జరిగింది. అందుకు సంబంధించి పిక్స్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







