లైకా ప్రొడక్షన్స్ తో మణిరత్నం
- January 31, 2018
చెలియా సినిమాతో మరోసారి నిరాశపరిచిన లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. భారీ తారాగణంతో మల్టీ స్టారర్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఫిబ్రవరి చివరి వారంలో సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్న ఈ సినిమాలో శింబు, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, ఫహాద్ ఫాజిల్ లాంటి సౌత్ టాప్ స్టార్స్ నటిస్తున్నారు.
ఇంతటి భారీ చిత్రాన్ని మణిరత్నంతో కలిసి నిర్మించేందుకు భారీ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ముందుకు వచ్చింది. మణిరత్నం సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్తో కలిసి లైకా ప్రొడక్షన్ మణిరత్నం తదుపరి చిత్రాన్ని నిర్మించనుంది. వరుసగా భారీ చిత్రాలను రూపొందిస్తున్న లైకా సంస్థ మణిరత్నంతో కలవటంతో అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి. మణి స్టైల్ లో రూపొందనున్న ఈ సినిమాకు సంతోష్ శివన్ సినిమాటోగ్రఫి అందిస్తుండగా ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







