పాంబన్తో షాకిచ్చిన శరత్‌కుమార్
- February 01, 2018
ఇప్పటి వరకు కమర్షియల్, సామాజిక పాత్రల్లో కనిపించిన సీనియర్ నటుడు శరత్‌కుమార్ తన కొత్త చిత్రం 'పాంబన్'తో ప్రేక్షకులకు, అభిమానులకు షాకిచ్చారు. సోషియో ఫాంటసీ కథతో దర్శకుడు ఎ.వెంకటేష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శరత్‌కుమార్ పాము పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ గురువారం చెన్నైలో ప్రారంభంకాగా, అదే రోజున ఫస్ట్‌లుక్ పోస్టర్లు కూడా విడుదల చేశారు. వాటిలో పాము శరీరం, శరత్‌కుమార్ తలతో ఉన్న ఫోటోలు సంచలనంగా మారాయి. కొన్నేళ్లుగా తండ్రి పాత్రలు, క్యారెక్టర్ రోల్స్‌కే పరిమితమైన శరత్‌కుమార్ మళ్లీ హీరోగా సత్తా చాటాలనుకుంటున్నారు. అందుకోసం కొత్తదనం ఉన్న కథలను ఎంచుకుంటున్నారు. అలా 'పాంబన్'లో పాము పాత్రలో నటించేందుకు ఓకే చెప్పారు. గ్రాఫిక్స్ ప్రధానంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎ్‌సకే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ దేవా సంగీతం సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







