వాటర్ హీటర్ పేలుడు: మహిళ, చిన్నారికి గాయలు
- February 01, 2018
అల్ అయిన్: వాటర్ హీటర్ పేలుడుతో అల్ అయిన్‌లో ఓ మహిళ, చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అంఇస్తున్నారు. అల్ అయిన్‌లోని క్రిమినల్ ఎవిడెన్స్ డిపార్ట్‌మెంట్ - ఫైర్ ఇన్సిడెంట్స్ హెడ్ మేజర్ అబ్దుల్లా మటర్ అల్ దహెరి మాట్లాడుతూ, హీటర్‌లోని కాపర్ సేఫ్టీ వాల్వ్ సరైనది వాడకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామని చెప్పారు. డివైజ్‌లో మీట్ రెగ్యులేషన్‌ని ఇది చేపడుతుంది. వాల్వ్ గ్యాప్‌లో సాల్ట్ ఎక్కువగా డిపాజిట్ కావడంతో ప్రమాదం చోటు చేసుకుంది. అబుదాబీ పోలీసులు, వాటర్ హీటర్స్ వినియోగానికి సంబంధించి పలు సందర్భాల్లో పలు రకాలైన సూచనలు చేశారు. ఎప్పటికప్పుడు వాటర్ హీటర్లను సరిగ్గా మెయిన్‌టెయిన్ చేయాల్సి ఉంటుందనీ, సమస్య వచ్చినప్పుడు నిపుణులతో బాగుచేయించుకోవాలని సూచించారు. ఎక్కువ సమయం నీటిలో వాటర్ హీటర్ డివైజ్‌లను ఉంచరాదని కూడా పోలీసులు, రెసిడెంట్స్‌కి హెచ్చరిక చేశారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో ఫాగ్ అలెర్ట్.. వాహనదారులకు హెచ్చరిక..!!
- యూఏఈలో కార్మిక చట్ట ఉల్లంఘనలు 15 శాతం తగ్గాయి
- కువైట్ లో ప్రమాదకరంగా డ్రైవింగ్.. ఇద్దరు అరెస్ట్..!!
- పాకిస్థాన్‌లో పోలీస్ ప్రధాన కార్యాలయం పై దాడి..మృతుల సంఖ్య 31కి చేరింది
- షార్జాలో వాహనదారులకు సులభతర సేవలు..కొత్త కార్యక్రమం ప్రారంభం
- నేపాల్‌కు 11 టన్నుల సహాయక సామగ్రిని పంపిన భారత్
- ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనం..కిటకిటలాడుతున్న క్యూలైన్లు!
- రష్యాపై ఆంక్షల బిల్లు పై ట్రంప్ సంతకం
- దుబాయ్‌లో Dh190,000 చోరీ..నిమిషాల్లోనే ముగ్గురు అరెస్ట్..!!
- కువైట్‌లో ఫైర్ఫోర్స్కు 8,282 అత్యవసర కాల్స్..!!







