ఇండియన్స్ స్కూల్ బహ్రెయిన్‌లో మేథ్స్ డే సెలబ్రేషన్స్
- February 01, 2018
ప్రఖ్యాత మేథమేటీషియన్, దివంగత శ్రీనివాస రామానుజన్‌కి నివాళులర్పిస్తూ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బహ్రెయిన్ (ఐఎస్బి) మేథమేటిక్స్ డిపార్ట్మెంట్, మేథ మేటిక్స్ డే 2018ని ఇసా టౌన్ స్కూల్ క్యాంపస్‌లో నిర్వహించింది. జనవరి 29న ఈ కార్యక్రమం జరిగింది. యూనివర్సిటీ ఆఫ్ బహ్రెయిన్ డిపార్ట్మెంట్ ఆఫ్ మేథమేటిక్స్ మరియు ఛైర్మన్ డాక్టర్ ఫైసల్ అల్ షౌవైక్, న్యాయ నిర్ణేతగా పలు కాంపిటీషన్స్ మేథ్స్ సబ్జెక్ట్‌పై జరిగాయి. ఈ కార్యక్రమానికి ఐఎస్బి ఇసి మెంబర్ ప్రేమలత, ప్రిన్సిపాల్ విఆర్ పళనిస్వామి, వైస్ ప్రిన్సిపల్స్, స్టాఫ్ మరియు స్టూడెంట్స్ హాజరయ్యారు. డాక్టర్ ఫైసల్ అల్ షోవైక్ మేథమేటిక్స్ ఆవశ్యకతను తెలియజేశారు. మేథమేటిక్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సెంథిల్, ఆహూతులకు ఆహ్వానం పలికారు. 4 నుంచి 8 క్లాసులకు చెందిన 45 మంది స్టూడెంట్స్‌కి ఈ సందర్భంగా మ్యాట్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్‌లో ప్రతిభ చూపించినందుకుగాను సర్టిఫికెట్లను అందజేశారు. మేథమేటిక్స్ బిహైండ్ మ్యూజిక్ టాపిక్‌పై 9 మరియు 11 తరగతులకు చెందిన విద్యార్థులకు పేపర్ ప్రెజెంటేషన్ కాంపిటీషన్ నిర్వహించారు. క్లాస్ 11-1కి చెందిన సత్మా అబ్రహామ్‌కి తొలి బహుమతలి లభించింది. రెండో బహుమతి 9-కెకి చెందిన రిధి నిలేష్‌కుమార్ గెల్చుకున్నారు. మూడో బహుమతి 11-1 నైఫా నలీమ్కి దక్కింది.
తాజా వార్తలు
- ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనం..కిటకిటలాడుతున్న క్యూలైన్లు!
- రష్యాపై ఆంక్షల బిల్లు పై ట్రంప్ సంతకం
- దుబాయ్‌లో Dh190,000 చోరీ..నిమిషాల్లోనే ముగ్గురు అరెస్ట్..!!
- కువైట్‌లో ఫైర్ఫోర్స్కు 8,282 అత్యవసర కాల్స్..!!
- అబుదాబి నుంచి రాస్ అల్ ఖైమాకు ఫ్లయింగ్ కార్..!!
- అంగోలా అధ్యక్షుడితో ఒమన్ సుల్తాన్ విందు భేటీ..!!
- ఇజ్రాయెల్ మీడియాలో తప్పుడు కథనాలను ఖండించిన ఖతార్..!!
- 41 దేశాలతో మల్టీనేషనల్ సముద్ర రక్షణ కూటమి..!!
- రెండేళ్ల కష్టాలకు తెర.. ఇద్దరు పిల్లలతో స్వదేశానికి చేరుకున్న భారతీయ మహిళ..!!
- పాస్‌పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు..కొత్త రూల్స్ ఇవే







