డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల తీరుపై నిర్మాతల మండలి నిరసన..
- February 01, 2018
డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు అధికంగా వసూలు చేస్తున్న చార్జీలకు వ్యతిరేకంగా నిర్మాతల నుండి తీవ్రవ్యతిరేకత ఎదురవుతోంది. ఇతర రాష్ట్రాల కంటే అత్యధికంగా ఛార్జీలు తీసుకుంటున్న తీరుపై చాలాకాలంగా నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వీస్ ప్రొవైడర్లను కట్టడి చేయాలనే ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం అత్యవసర సమావేశం జరిగింది. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు పి.కిరణ్, సెక్రటరీలు ఎమ్.రామదాసు, కె.శివప్రసాదరావు, తెలంగాణ రాష్ట్ర ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు కె.మురళీమోహన్, సెక్రటరీ సునీల్ నారంగ్, దక్షిణాది ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు ఎల్. సురేష్, జాయింట్ సెక్రటరీ రవి కొట్టరాకర, తమిళ సినిమా నిర్మాతల సంఘం అధ్యక్షుడు విశాల్ కృష్ణ, కర్ణాటక ఫిలిం ఛాంబర్ సెక్టరీ ఎన్.ఎమ్. సురేష్, కేరళ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు కె.విజయ్‌కుమార్, డిస్ట్రీబ్యూషన్ ఛాంబర్ సెక్రటరీ ఎన్.ఎమ్. సురేష్, కేరళ ఫిలిం నిర్మాతల సంఘం అధ్యక్షులు జి.సురేష్‌కుమార్ ఇంకా మరికొందరు నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యాలయంలో అత్యవసర సమావేశమై చర్చించారు. మన సినిమాల ప్రతిఫలం మనకు చెందకుండా డిజిటల్ ప్రొవైడర్లకు చెందడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
ఎక్కడనుంచో వచ్చిన ప్రొవైడర్లు అన్యాయంగా దోచుకుంటున్నారని ఆవేదన చెందారు. ప్రొవైడర్లు ఈస్ట్ ఇండియా కంపెనీలా తయారయ్యారని, అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని సమావేశమైన అందరూ ఆరోపించారు. తక్కువ ధరకు వస్తున్న డిజిటల్ ప్రొవైడర్లను రాకుండా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజిటల్ ప్రొవైడర్లతో ఒకవారంలోగా సమావేశం ఏర్పాటుచేసి వెంటనే ధరలు తగ్గించేలా చర్చించాలని సమావేశం నిర్ణయం తీసు కంది.
వారంలోగా సమస్యకు పరిష్కారం లభించని పక్షంలో మార్చి ఒకటవ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని థియేటర్లను మూసివేయా లని సమావేశంలో నిర్ణయం తీసుకున్నా మని తెలుగు చలనచిత్ర పరిశ్రమ వాణిజ్య మండలి అధ్యక్ష కార్యదర్శులు పి.కిరణ్, ఎం.రాందాస్, కె.శివప్రసాదరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సమావేశంలో ఇంకా డి.సురేష్‌బాబు, శ్యామ్ ప్రసారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









