యాప్ దొంగని పట్టించింది
- February 01, 2018
తెల్లవారుజామున నాలుగ్గంటల సమయంలో నడుచుకుంటూ వెళుతున్నాడు. ఎక్కడినుంచో వచ్చారు ముగ్గురు యువకులు అతడి చేతిలోని ఫోన్ లాక్కుని పరారయ్యారు. విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో తెల్లవారు జామున ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళుతున్నాడు. అతడి చేతిలో సెల్ ఫోను ఉంది. దూరం నుంచి గమనించిన ముగ్గురు వ్యక్తులు వచ్చి అతడి చేతిలో ఉన్న ఫోన్ లాక్కుని పరారయ్యారు. అతడు తేరుకునే లోపే వచ్చిన ముగ్గురూ కనిపించకుండా పోయారు. దీంతో ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి విషయాన్ని పోలీసులకు వివరించాడు. కంప్లైంట్ తీసుకున్న వెంటనే రంగలోకి దిగిన పోలీసులు చోరుల కోసం గాలింపు జరిపారు. కంప్లైంట్ దారుడు ఫోన్‌లో 'ఫైండ్ మై డివైజ్' అనే యాప్ ఉన్నట్లు పోలీసులకు తెలియజేశాడు. వెంటనే పోలీసులు గూగుల్ మ్యాప్‌లో ఫోన్ ఎక్కడ ఉందీ గుర్తించారు. పోలీసులు అక్కడకు వెళ్లి చూడగా చీకటిగా ఉండడంతో ఎవరూ కనిపించలేదు. అయితే అక్కడ పార్క్ చేసి ఉన్న వాహనాలు తనిఖీ చేయగా అందులో ఒక వాహనం సైలెన్సర్ వేడిగా ఉండడాన్ని గుర్తించారు. దొంగ ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాడని భావించిన పోలీసులు అక్కడే కొద్ది సేపు గమనించారు. వాహనదారుడిని గుర్తించారు. అరగంట వ్యవధిలోనే వారిని పట్టుకున్నారు. అతడితో పాటు సహకరించిన మరో ఇద్దరినీ కూడా అరెస్టు చేసి విచారిస్తున్నారు. నిందితులను వెంటనే పట్టుకున్న పోలీసులను ఎస్పీ అభినందించారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







