మధురై మీనాక్షి ఆలయంలో భారీ అగ్నిప్రమాదం...
- February 02, 2018
తమిళనాడులోని ప్రసిద్ధ మధురై మీనాక్షి ఆలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. టెంపుల్లోని వేయికాళ్ల మండపం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 50కి పైగా చిన్న దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటన సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని 10 అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలార్పారు. కలెక్టర్ వీరరాఘవరావు మీనాక్షి దేవాలయానికి చేరుకుని పరిశీలించారు.
భద్రతాలోపం కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆలయం వద్దకు వేలాదిగా చేరుకుని ఆందోళనకు దిగారు. అధికారుల వాహనంపై రాళ్లు సైతం రువ్వారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆలయాన్ని తమ దిగ్బంధనంలోకి తీసుకున్నారు. ఆలయంలోకి ఎవ్వరినీ అనుమతించడం లేదు. చుట్టుపక్కల విద్యుత్ సరఫరా సైతం నిలిపివేశారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







