లిబియాలో శరణార్థులు గల్లంతు
- February 02, 2018
లిబియా నుంచి యూరోప్‌కు అక్రమ వలసదారులతో వెళ్తున్న ఓ పడవ మధ్యధరా సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 90 మంది శరణార్థులు గల్లంతైనట్లు సమాచారం. గల్లంతైన వారిలో 10 మంది మృతదేహాలు లిబియా తీర పట్టణమైన జవారా ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. వీరిలో 8 మంది పాకిస్తానీయులు, ఇద్దరు లిబియాకు చెందిన వారు ఉన్నట్లు భావిస్తున్నారు. పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కటం వల్లే పడవ మునిగిపోయిందని ప్రాథమికంగా నిర్ధారించినట్లు అంతర్జాతీయ వలస సంస్థకు చెందిన ప్రతినిధి ఒలివియా హెడన్ తెలిపారు. గల్లంతైన వారిలో ఎక్కువ మంది పాక్‌కు చెందిన వారే ఉన్నారని ఆమె పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







