ఇండియాకి ఒమన్ ఎయిర్ కొత్త విమానాలు
- February 05, 2018
మస్కట్: నేషనల్ కెరీర్ ఒమన్ ఎయిర్, ఇండియాలోని వివిధ ప్రాంతాలకు అదనంగా విమాన సర్వీసుల్ని నడిపేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఒమన్ ఎయిర్ సీఈఓ అబ్దుల్ అజీజ్ అల్ రైసి మాట్లాడుతూ, అహ్మదాబాద్, మంగళూరు, కోల్కతాలకు విమానాల్ని నడిపేందుకోసం ఒమన్ - ఇండియా ప్రభుత్వాలతో ఒప్పందాలు రివైజ్ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఒమన్ ఎయిర్ కొత్త బోయింగ్ 737 మ్యాక్స్ని బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద ప్రారంభిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు అబ్దుల్ అజీజ్. మొరాకో, టర్కీ, రష్యాలకు కూడా ఒమన్ ఎయిర్ విమానాల్ని నడపనుంది. బీరట్, సింగపూర్, చిట్టాగ్యాంగ్, ఢాకాలకు విమాన సర్వీసుల్ని రీ-లాంఛ్ చేయాలనుకుంటోంది ఒమన్ ఎయిర్. 2016లో ఒమన్ భారత్ మధ్య విమన సర్వీసులకు సంబంధించి ఒప్పందాల్లో సవరణ జరిగింది. ఆ సవరణ ప్రకారం ప్రతి వారం 6,258 సీట్ల నుంచి 27,405 సీట్ల వరకు పెరిగింది.
తాజా వార్తలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!







