నిధులును దారి మళ్లించిన సీఎం సిద్ధరామయ్య
- February 05, 2018_1517817808.jpg)
అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ కర్ణాటకలో ప్రారంభించిన నవనిర్మాణ పరివర్తన యాత్ర ప్రధాని నరేంద్ర మోడీ సభతో ఘనంగా ముగిసింది. బెంగళూరులోని ప్యాలస్ గ్రౌండ్లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ప్రధాని.. రైతుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. టమాటో, ఉల్లిపాయలు, ఆలుగడ్డలు పండించే రైతులకు అగ్ర ప్రాధాన్యం ఇచ్చామన్నారు. గత ప్రభుత్వాలు రైతులను ఆదుకోలేదన్న ప్రధాని.. తాము అన్నదాతల మేలు ముందడుగు వేశామని, మద్దతు ధర కల్పించడానికి కొత్త పథకాన్ని తీసుకొస్తున్నామన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ నిష్క్రమణ దశలో ఉందని ప్రధాని విమర్శించారు. కాంగ్రెస్ పాలనకు తెర పడిందని అనడానికి ర్యాలీకి భారీగా హాజరైన ప్రజలే సంకేతం అన్నారు. ప్రజా సంక్షేమానికి కేంద్రం కేటాయించిన నిధులను కాంగ్రెస్ తన సంక్షేమానికి వాడుకుంటోందని ఆరోపించారు. కర్ణాటక అభివృద్ధికి ఉపయోగించాల్సిన నిధులను సీఎం సిద్ధరామయ్య దారిమళ్లించారని మండిపడ్డారు.
కేంద్ర బడ్జెట్లో కర్ణాటకకు ఇచ్చిన తాయిలాల గురించి కూడా ప్రధాని ర్యాలీలో చెప్పారు. బెంగళూర్ మెట్రోకు 17 వేల కోట్లు కేటాయించాని, దీని ద్వారా 15 లక్షల మంది నగర ప్రయాణీకులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. రైతుల ప్రయోజనాల కోసం ఆపరేషన్ గ్రీన్ చేపట్టామని..ఇది డైరీ రైతులకు అమూల్ తరహాలో మెరుగైన ప్రయోజనాలు అందిస్తుందని చెప్పారు. నవంబర్ 1న అమిత్ షా బెంగళూరులో ప్రారంభించిన నవనిర్మాణ యాత్ర 90 రోజుల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ సభతో ముగిసింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి