సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట్లో దొంగతనం

- February 05, 2018 , by Maagulf
సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట్లో దొంగతనం

రూ.4లక్షలు మాయం ఫిల్మ్‌నగర్‌, న్యూస్‌టుడే: ప్రముఖ సినీ సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట్లో చోరి జరిగింది. ఇంట్లోని బీరువాలో భద్రపర్చిన రూ.4లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు పోలీసుల కథనం ప్రకారం.. ఫిలింనగర్‌లో నివాసముంటున్న సినీ సంగీత దర్శకులు మణిశర్మ కొద్ది రోజుల క్రితం ఇంట్లోని బీరువాలో రూ.4లక్షల నగదును భద్రపర్చారు. ఆదివారం అవసరాల నిమిత్తం ఆ నగదును తీసేందుకు చూడగా నగదు కన్పించక పోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. దీంతో మణిశర్మ మేనేజర్‌ సుబ్బానాయుడు బంజారాహిల్స్‌ పోలీసులకు ఈ చోరీ ఘటనపై ఫిర్యాదు చేశారు. డీఐ కె.రవికుమార్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com