కోలీవుడ్ లో శివానీకి ఆఫర్..
- February 05, 2018
నటుడు రాజశేఖర్ పెద్ద కుమార్తె శివానీ త్వరలోనే టాలీవుడ్ లో ఆరంగేట్రం చేయనుంది.. హిందీలో హీట్ మూవీ 2 స్టేట్స్ రీమేక్ కోసం శివానీని హీరోయిన్ గా ఎంపిక చేశారు.. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.. ఈ నేపథ్యంలో తమిళంలో ఆమె మరో ఆఫర్ దక్కింది. హీరో విష్ణు విశాల్ తో దర్శకుడు వెంకటేష్ రూపొందించే తమిళ మూవీలో ఆమెను తీసుకున్నారు..దీనిపై శివానీ మాట్లాడుతూ, ఇటీవల విష్ణు విశాల్ కార్యాలయం నుంచి తనకు ఫోన్ వచ్చిందని చెప్పింది. తన ఫొటోలు పంపించమని చెప్పారని తెలిపింది. ఆ తరువాత తాను చెన్నైకి వచ్చి, దర్శకుడు వెంకటేశ్, విష్ణువిశాల్‌లను కలిశానని చెప్పింది. దర్శకుడు చెప్పిన కథ తనకు చాలా బాగా నచ్చిందని, అయితే ఆ సమయంలో వారు హీరోయిన్‌గా తనను కన్ఫార్మ్ చేయలేదని అంది. మరి కొన్ని రోజుల తరువాత తమ చిత్రంలో హీరోయిన్‌వి నువ్వే అని చెప్పారని తెలిపింది. ప్రేమతో కూడిన చాలా ఢిపరెంట్ కథా చిత్రంగా ఈ చిత్రం ఉంటుందని చెప్పింది. మూడో సంవత్సరం మెడిసిన్ చదువుతున్న శివానీ చదువుతో పాటు డాన్స్ క్లాసులకు వెళ్లుతున్నది. బెల్లీ, కథక్ నృత్యాలను నేర్చుకుంటున్నది.
తమిళ మూవీ ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. వేల్‌రాజ్ ఛాయాగ్రహణం, గాయకుడు క్రిష్ సంగీతాన్ని అందించనున్నాడు..
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







