కళ్యాణ్ రామ్ 'నా నువ్వే' మూవీ షూటింగ్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో
- February 05, 2018
నందమూరి కల్యాణ్‌రామ్, తమన్నా నాయకానాయికలుగా జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నా.నువ్వే . కూల్‌బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో, ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నెలాఖరుకు షూటింగ్ దాదాపుగా పూర్తవుతుంది. తాజాగా ఈ మూవీ కోసం కళ్యాణ్ రామ్ , తమన్నాల మధ్య కొన్ని సీన్స్ ను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో చిత్రీకిరించారు.. షూటింగ్ స్పాట్ ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతున్నది. . ఈ మూవీలో తమన్నా రెడియో జాకీ మీరాగా నటిస్తున్నది. ఈ సమ్మర్ లో ఈ మూవీ విడుదల కానుంది.
ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో తనికెళ్ళ భరణి, పోసాని, వెన్నెలకిషోర్, ప్రవీణ్, బిత్తిరి సత్తి, ప్రియ, సురేఖవాణి తదితరులు తారాగణం. ఈ చిత్రానికి సంగీతం: షరెత్, ఎడిటింగ్: టి.ఎస్.సురేష్, సమర్పణ: మహేష్ కోనేరు, నిర్మాతలు: కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి, కథ, స్క్రీన్‌ప్లే: జయేంద్ర, దర్శకత్వం: జయేంద్ర.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు