16 ఏళ్ల అమెరికా అమ్మాయితో దుబాయ్ క్యాబ్‌డ్రైవర్ ఏం చేశాడంటే..
- February 06, 2018
దుబాయ్: అమెరికాకు చెందిన 16 ఏళ్ల అమ్మాయిని ఓ పాకిస్తానీ క్యాబ్ డ్రైవర్ కారులో ఎక్కించుకున్నాడు. ఆమెపై లైంగికదాడి చేయబోయాడు. ఆమె తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన రాస్‌అల్‌ఖైమాలో జరిగింది.
అల్ రఫా పోలీసుల కథనం ప్రకారం... ఈ మధ్యనే దుబాయ్ పర్యటనకు వచ్చిన ఆ అమ్మాయి తన స్నేహితురాలి ఇంట్లో ఉంటోంది. శనివారం ఆమె తన స్నేహితురాలిని కలిసేందుకు వెళ్లాలని క్యాబ్ బుక్ చేసుకుంది.
క్యాబ్ డ్రైవర్ పక్కన ముందు సీట్లో ఆమె కూర్చుంది. కొద్దిదూరం వెళ్లాక పాకిస్తానీ క్యాబ్ డ్రైవర్ ఆమెను అసభ్యకరంగా తాకడం మొదలుపెట్టాడు. ఆమెకేం చేయాలో అర్థం కాలేదు. అంతలోనే క్యాబ్‌ను ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన డ్రైవర్ ఆ అమ్మాయిపై లైగింకదాడి చేయబోయాడు.
ఆమెను అతడు పట్టుకోబోయిన సందర్భంలో ఆమె చేతికున్న ఉంగరం జారి కారులో పడిపోయింది. ఆమె ఎలాగోలా అతడిబారినుంచి తప్పించుకుంది. ఆ తరువాత కూడా ఆ క్యాబ్ డ్రైవర్ ఆమెను వదల్లేదు.
ఆమె మొబైల్‌కు అభ్యంతకరమైన ఫోటోలు, మేసేజ్‌లు పంపుతూ మానసికంగా ఆ అమ్మాయిని క్షోభ పెట్టాడు. ఇక లాభం లేదనుకుని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు అతడ్ని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.
తాజా వార్తలు
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!







