నిఖిల్ బాబూ.. నీకెందుకయ్యా పాలిటిక్స్ ..!
- February 06, 2018
ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు.. ముందడుగేస్తేనే కదా మార్పు అనేది సాధ్యం..? ఈ మాటను బాగా ఒంటబట్టించుకున్నాడో ఏమో టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నేను సైతం అంటూ ముందుకురికాడు. పట్టుమని పది సినిమాలైనా చేయని ఈ బుడతడు ఇప్పుడు సడన్ గా రాజకీయాలు మాట్లాడ్డం మొదలుపెట్టాడు. సినిమా వాళ్ళు రాజకీయాలు చేయడం కొత్తేమీ కానప్పటికీ.. నిఖిల్ కూడానా అంటూ.. ఆసక్తిగా చూస్తోంది టాలీవుడ్.
విషయం ఏమిటంటే.. నిఖిల్ బాబు తాజాగా ఒక ట్వీట్ పెట్టాడు. ఈ ట్వీట్ మరో 'బాబు'ని టార్గెట్ చేస్తున్నట్లుండడమే ఇక్కడ ఇంట్రస్టింగ్ ఎలిమెంట్. ఏపీ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కావాల్సిందే.. అనేది ఆ ట్వీట్ అసలు తాత్పర్యం. "ఈ మధ్యే నేను ఏపీలో షూటింగ్ చేశా. అక్కడంతా చూస్తే చాలా బాధేసింది. ఇంకా డెవలప్ కావాలి..
ఆలా కావాలంటే చాలా ఫండ్స్ రావాలి" అంటూ రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వాలను సున్నితంగా టార్గెట్ చేశాడు. 'ఎస్.. యువ్వార్ కరెక్ట్ బాస్..' అంటూ నిఖిల్ ట్వీట్ కి మాంచి రియాక్షన్ వచ్చింది.. వస్తోంది.
"ఇవన్నీ నీకెందుకు అని మీరు అడగొచ్చు.. కానీ సగటు భారతీయుడిగా అడిగే హక్కు నాకుంది.." అంటూ ముందుగానే క్లారిటీ ఇచ్చుకున్నాడు.
స్పెషల్ స్టేటస్ ఇస్తానని ఇవ్వకుండా మొహం చాటేసిన బీజేపీని, స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా పర్వాలేదన్న టీడీపీని కలిపి తిట్టినట్టుంది నిఖిల్ ట్వీట్. పవన్ కళ్యాణ్ తరహాలో ప్రశ్నించే గుణాన్ని తాను కూడా అలవర్చుకుంటున్నాడని కొందరంటే..
కాదుకాదు.. అతడి 'కిర్రాక్ పార్టీ' సినిమా ప్రమోషన్ కోసమే ఇలా రోడ్డుమీద పడ్డారని మరికొందరు సెటైర్లేస్తున్నారు. అయినా.. హైదరాబాద్ బేగంపేటలో పుట్టి..
బంజారా హిల్స్ ముఫకం ఝా కాలేజ్ లో చదువుకున్న ఈ పక్కా తెలంగాణా కుర్రోడికి.. ఆంధ్రాకు రావాల్సిన స్పెషల్ స్టేటస్ తో పనేంటన్న ప్రశ్నలు కూడా పడిపోతున్నాయి.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







