వివాదాల్లోకి ఇరుక్కుపోయిన దర్శకుడు క్రిష్ ఆందోళన

- February 06, 2018 , by Maagulf
వివాదాల్లోకి ఇరుక్కుపోయిన దర్శకుడు క్రిష్ ఆందోళన

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దిగ్గజ దర్శకుడు అనిపించుకోగల అతి కొద్ది మంది దర్శకుల్లో క్రిష్ ఒకరు. ఆయన తీసిన ప్రతీ సినిమా విమర్శకులతో పాటు , ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ఆయన తీసిన ప్రతీ సినిమాలో అంశంపై సందేశాత్మకంగా తీస్తారు. అయితే ఈ దర్శకుడు ప్రతి సినిమాతో పాటు తెలియకుండానే ఏదో ఒక రకమైన వివాదాల్లోకి నెట్టి వెయ్యబడుతున్నాడు. పోయిన సంవత్సరం అయన తీసిన శాతకర్ణి సినిమా కథకు సంబంధించిన వివాదాలు కూడా బాగానే ఇబ్బంది పెట్టాయి.

ప్రస్తుతం ఆయన తీస్తున్న మణికర్ణిక సినిమా షూటింగ్ శరవేగంగా దూసుకుపోతోంది. సినిమాని ని అనుకున్న సమయానికి పూర్తి చెయ్యగలడు అనే పేరు కలిగిన ఆయన ఈ సినిమాని కూడా చాలా పకడ్బందీగా ప్లాం చేసుకుని వెళ్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబందించిన రెండు వివాదాలు క్రిష్ ని ఊపిరి సలుపనివ్వడం లేదు అంట. ఝాన్సీ లక్ష్మి భాయి కథ మీదుగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే సర్వ బ్రాహ్మణ సమాజం అనే వారు క్రిష్ ఈ సినిమాని మూల కథ మార్చి తీస్తున్నాడని ఆరోపించారు. ఝాన్సీ లక్ష్మీ భాయ్ కు ఒక బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ కు మధ్యలో ఒక ప్రేమ యానం నడిచినట్టుగా ఈ కథలో రాసుకున్నారని , ఇలా చరిత్రని వక్రీకరించి తీస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ వివాదానికి మూలం ఈ సినిమాకు మూల కథ ఒక ఇంగ్లీష్ వారు రాసిన నవల ఆధారంగా తీయడం వలన వచ్చింది.

ఈ వివాదాలు చాలవు అన్నట్టు , కంగనా మెడ చుట్టూ హృతిక్ రోషన్ , కరణ్ జోహార్ లతో వివాదాలు ఎంతగా కుదిపేశాయో చెప్పనక్కర్లేదు. పరిస్థితి ఇలా ఉండగా క్రిష్ సైతం వివరణ ఇవ్వడానికి అందుబాటులో ఉండకపోవడంతో, విషయం ముదిరి పాకాన పడుతోంది. మొన్న విడుదల అయిన పద్మావతి సినిమాకి ఎంతగా వివాదాలు చుట్టుముట్టాయో మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రతీ సినిమాకి ఇలా గొడవలు పెరుగుతూ ఉండటం ఇండస్ట్రీ లోని వారందరికీ ఆందోళన కలిగిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com