తైవాన్‌లో భారీ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4
- February 06, 2018
-కుప్పకూలిన హోటల్ -శిథిలాల కింద 30 మంది చిక్కుకున్నట్లు అనుమానం తైపే: తైవాన్‌లో భారీ భూకంపం సంభవించింది. తీరప్రాంత నగరం హాలియన్‌కు 21 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4 గా నమోదైంది. ప్రాణనష్టం, ఆస్తినష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. స్థానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి 11.50 గంటలకు సంభవించిన ఈ ఘటనలో మార్షల్ హోటల్ భవనం కుప్పకూలి పలువురు చిక్కుకుపోయినట్లు తైవాన్ ప్రభుత్వం వెల్లడించింది. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు అత్యవసర విభాగం రంగంలోకి దిగింది. భూకంపం ధాటికి హోటల్‌తో పాటు పలు భవనాలు కుప్పకూలిపోయాయని, శిథిలాల కింద సుమారు 30 మంది చిక్కుకుని ఉంటారని స్థానిక మీడియా పేర్కొంది. ఆదివారం కూడా ఇదే ప్రాంతంలో నిమిషాల వ్యవధిలో ఐదు సార్లు ప్రకంపనలు వచ్చినట్లు తైవాన్ వాతావరణ శాఖ తెలిపింది. 1999 సెప్టెంబర్ నెలలో తైవాన్‌లో భూకంపం సంభవించి సుమారు 2400 మంది మృత్యువాతపడ్డారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!