అల్ జబుర్, సుష్మా స్వరాజ్ తో చర్చలు

- February 07, 2018 , by Maagulf
అల్ జబుర్, సుష్మా స్వరాజ్ తో  చర్చలు

రియాద్: సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల మంత్రి అడిల్ అల్-జుబీర్ బుధవారం రియాద్ లో భారతదేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తో చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా బలపరుచుకోవడానికి  తగిన మార్గాలను పెంపొందించడానికి  వారు ఈ సందర్భంగా  చర్చించారు. పరస్పర ఆందోళనకు గురిచేసే అనేక ఇతర అంశాలపై సైతం చర్చలు జరిగాయి. అల్-జుబీర్  సుష్మా స్వరాజ్ గౌరవార్థం మరియు ఆమెతో పాటు ఉన్న ప్రతినిధి బృందంకు ఒక విందును నిర్వహించారు. రియాద్ సమీపంలోని జనద్రియా గ్రామంలో 32 వ నేషనల్ ఫెస్టివల్ అఫ్ హెరిటేజ్ అండ్ కల్చర్ ప్రారంభోత్సవ వేడుకకు హాజరు కావాల్సిందిగా భారతీయ మంత్రి సుష్మా స్వరాజ్ ని అల్ జబుర్ కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com