దుబాయి ముర్డోచ్ యూనివర్సిటీలో 5 వ అంతస్తు పై నుంచి కిందకు దూకి భారతీయ విద్యార్థి ఆత్మహత్య

- February 08, 2018 , by Maagulf
దుబాయి ముర్డోచ్ యూనివర్సిటీలో 5 వ అంతస్తు పై నుంచి  కిందకు దూకి   భారతీయ విద్యార్థి ఆత్మహత్య

దుబాయ్:  యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. దుబాయ్ లోని ముర్డోచ్ యూనివర్శిటీ క్యాంపస్ లో ఓ  21 ఏళ్ల భారతీయ విద్యార్థి అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించాడని దుబాయ్ పోలీసులు తెలిపారు. ఈ సంఘటన గురించి అప్రమత్తం చేస్తూ తమ కార్యాలయ గదికి గురువారం ఒక ఫోన్ వచ్చిందని ఈ సమాచారం తెలియగానే వెంటనే తాము10.30 గంటలకు ఆ క్యాంపస్ కు చేరుకునేసరికి రక్తం మడుగులో విగతజీవిగా ఆ విద్యార్థి ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఆ భారతీయ విద్యార్థి ఒక భవనం యొక్క 5 వ అంతస్తు నుంచి కిందకు దూకి మరణించినట్లు పేర్కొంటున్నారు. తన తండ్రితో కల్సి విశ్వవిద్యాలయానికి ఫీజు చెల్లించటానికి వచ్చి, వాష్ రూమ్ కు వెళ్లివస్తానని తన తండ్రికి చెప్పి అయిదవ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడటం తన మనస్సుని ఎంతో బాధిస్తున్నట్లు మృతుని సన్నిహిత మిత్రుడు చెప్పాడు. చనిపోయిన తన స్నేహితుడు సంఘటన జరిగక ముందు రాత్రి తనతో మామూలుగానే మాట్లాడినట్లు చెబుతూ అతని మాటలలో ఎటువంటి నిరాశ గుర్తించలేదని తెలిపాడు. ఈ సంఘటన వెనక నేరారోపణ కోణం ఏడైన దొరుకుతుందేమోనని పోలీసులు ఈ కేసుని క్షుణంగా విచారణ జరుపుతున్నారు. ముర్డోచ్ యూనివర్శిటీ సైతం దుబాయి గురువారం తమ విద్యార్థుల్లో ఒకరు మరణించినట్లు ధ్రువీకరించారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, సహచరులకు తమ ప్రగాడ సంతాపాన్ని వ్యక్తపర్చారు. తమ యూనివర్సిటీ విద్యార్థి ఆత్మహత్యకుదారి తీసిన పరిస్థితులపై  విషయమై మేము సంబంధిత అధికారులతో కలిసి పనిచేస్తున్నాం.యూనివర్సిటీలో విద్యార్థులు అందరికి సిబ్బంది కౌన్సెలింగ్ సేవలను సైతం అందిస్తోందని ముర్డోచ్ యునివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com