జబెర్ అహ్మద్ సాంస్కృతిక కేంద్రంలో స్వల్ప అగ్నిప్రమాదం

- February 10, 2018 , by Maagulf
జబెర్ అహ్మద్ సాంస్కృతిక కేంద్రంలో స్వల్ప అగ్నిప్రమాదం

కువైట్ : జబెర్ అల్ అహ్మద్ సాంస్కృతిక కేంద్రంలోని  ఒక రెస్టారెంట్ వద్ద సేవాకేంద్ర గదిలో స్వల్పస్థాయిలో అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే ప్రమాద స్ధలానికి చేరుకొని  మంటలను అగ్నిమాపక శాఖ సిబ్బంది నియంత్రించారు. ఈ ప్రమాదంలో ఏ ఒక్కరూ గాయాల పాలవ్వలేదు అలాగే వస్తువులకు ఎటువంటి నష్టం కలగలేదని అగ్నిమాపక శాఖ ఒక ప్రకటనలో శుక్రవారం చెప్పారు. రక్షణ మరియు భద్రతా చర్యలను అమలు చేసిన తర్వాత, కేంద్రం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది, అయితే రెస్టారెంట్ ప్రాంతం మూసివేయబడింది. అమ్రి దివాన్ వద్ద సాంస్కృతిక కేంద్రాల స్థాపనకు ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడైన అబ్దుల్జిజ్ ఇషాక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒక రెస్టారెంట్లోని గదుల్లో గురువారం సాయంత్రం 5.59 గంటలకు జరిగిందని తెలిపారు.ఇషాక్ రెస్టారెంట్లు సాయంత్రం వేళ మూసివేశారు, వాటిని  సాధారణ రీతిలో (శనివారం) తిరిగి కార్యకలాపాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. అగ్నిప్రమాదం జరిగినవెంటనే అగ్నిమాపక సిబ్బంది స్పందన మరియు సంఘటన వృత్తిపరమైన నిర్వహణలో  అగ్నిమాపక సిబ్బంది నిబద్ధధకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com