తప్పిపోయిన భారతీయుడికోసం బహ్రెయిన్‌లో కొనసాగుతున్న 'సెర్చ్'
- February 13, 2018
మనామా: 60 ఏళ్ళ భారత జాతీయుడొకరు గడచిన వారం రోజులుగా తప్పిపోవడంతో అతన్ని కనుగొనేందుకు 'సెర్చ్' ఆపరేషన్ కొనసాగుతోంది. ఇండియన్ టాలెంట్ అకాడమీలో ఫుట్‌బాల్ కోచ్‌గా పనిచేస్తున్న తిలకన్ ఒండాయంకరన్ అనే వ్యక్తి ఫిబ్రవరి 4వ తేదీ నుంచి కన్పించడంలేదు. తాము నడుపుతోన్న అకాడమీలో తిలకన్ ఫుట్‌బాల్ కోచ్‌గా పనిచేస్తున్నారనీ, వారం రోజులుగా ఆయన కన్పించడంలేదని ఇండియన్ టాలలెంట్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ లతీష్ భరతన్ చెప్పారు. ఫిబ్రవరి 4న ఉదయం 9 గంటల సమయంలో మనామా మార్కెట్‌కి బస్‌లో వెళ్ళారనీ, స్టూడెంట్స్ కోసం జెర్సీలు కొనేందుకు వెళ్ళిన ఆయనతో ఉదయం 10.30 గంటల సమయంలో మాట్లాడననీ, ఆ తర్వాత 11 గంటల నుంచి అతని ఫోన్ స్విచాఫ్ వస్తోందని చెప్పారు భరతన్. పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు, ఎంబసీ సాయాన్ని కూడా కోరినట్లు ఆయన వివరించారు. గత 30 ఏళ్ళుగా తిలకన్‌తో తనకు స్నేహం ఉందని చెప్పారాయన. తిలకన్ కుమారుడు సైతం తన తండ్రి ఆచూకీ ఫిబ్రవరి 4వ తేదీ నుంచి దొరకడంలేదని చెప్పారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







