విదేశాల్లో భారీ సెట్స్ మధ్య మహేష్ ఇంట్రో సాంగ్..
- February 13, 2018
మహేశ్ బాబు, కొరటాల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'భరత్ అనే నేను' చిత్రం చిత్రీకరణ చివరి దశకి చేరింది. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ మినహా చిత్రం టాకీ పార్ట్ పూర్తయిపోయిందట. ప్రస్తుతం ఈ పాట కోసం చిత్ర బృందం విదేశాల్లోని లొకేషన్స్ వేటలో పడింది.
'బ్రహ్మోత్సవం, స్పైడర్' చిత్రాలతో అభిమానుల్ని పూర్తిగా నిరాశ పరచిన మహేశ్ బాబు.. తదుపరి చిత్రం 'భరత్ అనే నేను' మూవీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. యువ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి తహతహలాడుతున్న మహేశ్ ఈ చిత్రాన్ని ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్‌కు తీసుకొచ్చాడు. ఏప్రిల్ 27న రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న 'భరత్ అనే నేను' చిత్ర బృందం.. ఈ సినిమా కోసం కేవలం ఒకే ఒక పాటను బ్యాలెన్స్ ఉంచారు. అది కూడా హీరో ఇంట్రడక్షన్ సాంగ్. ఈ పాటను లండన్‌లో అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నాడు కొరటాల శివ . యూకేలో కొన్ని అద్భుతమైన లొకేషన్స్ ఎంపిక పూర్తయిందని.. త్వరలోనే మహేశ్ అండ్ టీం లండన్ బయల్దేరనున్నారని తెలుస్తోంది. ఈ పాట ఒక్కటి కంప్లీట్ చేస్తే.. ఇక ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయినట్టేనని అంటున్నారు.
ప్రస్తుతం 'భరత్ అనే నేను' చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో మహేశ్ బాబు చురుగ్గా పాల్గొంటూ చిత్ర బృందాన్ని ఉత్తేజ పరుస్తున్నాడట. మార్చికల్లా చిత్రాన్ని ఫినిష్ చేసి రిలీజ్ డేట్ వరకూ ప్రచారాన్ని ముమ్మరం చేయనుందట చిత్ర బృందం. ఈ సినిమాపై ఫుల్ కాన్సిడెన్స్‌గా ఉన్న మహేశ్ బాబు.. మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడనే అభిప్రాయంతో ఉన్నారు అభిమానులు. మరి ముఖ్యమంత్రి భరత్‌గా మహేశ్ బాబు ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.
తాజా వార్తలు
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్







