రియాద్ లో విరుచుకుపడిన ఇసుక తుఫాను
- February 14, 2018
రియాద్ : ఆకస్మాత్తుగా ఇసుక తుఫాన్ చెలారేగడంతో మంగళవారం రాత్రి రియాద్ చిగురుటాకులా వణికిపోయింది. సౌదీలోని చాలా ప్రాంతాల్లో ఇసుక తుఫాన్ వచ్చిందన్నారు. జెడ్డా, మక్కా, బార్హ, అల్ జామోన్ ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనబడింది. ఇసుక తుఫాను కారణంగా బుధవారం ఉదయం పలు పాఠశాలలు, అల్-ఇమామ్ యూనివర్సిటీ తరగతులను రద్దు చేశారు. ఇసుక తుఫాన్ సంభవించినపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సాయంత్రం 6 గంటలకే దట్టంగా అలుముకున్న ఇసుక కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలను స్పష్టంగా చూడటం వాహనదారులకు ఎంతో ఇబ్బంది ఏర్పడుతుంది. ఇసుక తుఫాన్ చుట్టిముట్టినపుడు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపి ఉంచడం ఉత్తమమని పౌర రక్షణ దళాలు పేర్కొంటున్నాయి. పౌరులు ఆ సమయంలో భద్రతా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నాయి.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







