నటనకు గుడ్‌బై .. రాజకీయాలపైనే పూర్తి దృష్టి ప్రకటించిన కమల్‌హాసన్
- February 14, 2018
చెన్నై, ఫిబ్రవరి 14:రాజకీయాలపై పూర్తిగా దృష్టిపెట్టబోతున్నానని, అందువల్ల ఇక సినిమాల్లో నటించనని ప్రఖ్యాత సినీనటుడు కమల్‌హాసన్ ప్రకటించారు. ప్రస్తుతం నటిస్తున్న రెండు చిత్రాలూ పూర్తయ్యాక ఇక పూర్తిగా రాజకీయాలకే పరిమితమవుతానని స్పష్టం చేశారు. రాజకీయాల్లో అరంగేట్రం చేస్తున్న కమల్‌హాసన్ త్వరలో తన పార్టీ పేరు, ప్రణాళికను ప్రకటించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బోస్టన్లోని హార్వర్డ్ వర్శిటీలో ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ మనసులోని మాట వెల్లడించారు. కాషాయ వర్ణాన్ని వ్యతిరేకిస్తున్న కమల్ రాజకీయాల్లో తను ఎంచుకున్న రంగు 'నలుపు' అని, ఇది ద్రవిడ స్వరానికి, నల్లని మేనికి ప్రతిబింబమన్నారు. సాంస్కృతికంగా నలుపు చెడ్డ రంగేమీకాదన్నారు. భవిష్యత్ ఎన్నికల్లో పరాజయం పాలవుతానని అనుకోవడం లేదని, నిజాయితీగా జీవించడానికి ఏదోఒకటి చేయాల్సి ఉందన్నారు. ఇన్నాళ్లూ రాజకీయ వేదికంటూ లేకపోయినప్పటికీ 37 ఏళ్లుగా సమాజసేవ చేస్తూనే ఉన్నానని చెప్పిన కమల్ అప్పటినుంచి తన వెనుక 10 లక్షలమంది విధేయులైన కార్యకర్తలు ఉన్నారని, ప్రజాసంక్షేమానికి పనిచేస్తున్నారని చెప్పారు. వీరిలో 250 మంది న్యాయవాదులు కూడా ఉన్నారన్న కమల్ సంపాదన కోసం తాను రాజకీయాల్లోకి రావడం లేదని, ప్రజాసేవ కోసమే వస్తున్నానని చెప్పారు.
కేవలం నటుడిగానే జీవితాన్ని ముగించాలని అనుకోవడం లేదని, ప్రజాసేవలో తుదిశ్వాస విడవాలని తనకు తానుగా చేసుకున్న ప్రతిన మేరకే రాజకీయాల్లోకి వచ్చానని కమల్ చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!







