ఇయర్ ఫోన్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్నారా.. ఇకపై చార్జ్‌షీట్ దాఖలు , జైలు శిక్ష

- February 14, 2018 , by Maagulf
ఇయర్ ఫోన్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్నారా.. ఇకపై చార్జ్‌షీట్ దాఖలు , జైలు శిక్ష

లేవడం ఆలస్యం చేతిలో ఫోను, చెవిలో ఇయర్ ఫోన్.. ఇదండీ వరస. సరే ఇంట్లో ఎలా ఉన్నా పర్లేదు. అయితే రోడ్డు దాటుతున్నప్పుడు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, బస్సులు ఎక్కుతున్నప్పుడు కూడా చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడుతూనో, పాటలు వింటూనో పరధ్యానంగా ఉంటారు. వచ్చే వాహనాల మోత వినిపించదు. పక్కన ఎవరు పలకరించినా ఏమీ పట్టదు. ఈ నిర్లక్ష్యం ప్రమాదాలకు దారి తీస్తుంది. ఒక్కోసారి ప్రాణాలు తీస్తుంది. మొన్నటికి మొన్న ఓ సాప్ట్‌వేర్ ఉద్యోగి అందులో ఆమె ప్రెగ్నెంట్ కూడా. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రోడ్డు క్రాస్ చేస్తోంది. ఇంతలో సిగ్నల్ పడింది. సిగ్నల్ పడిన విషయాన్ని పట్టించుకోకుండా ఓ బస్ డ్రైవర్ క్రాస్ చేశాడు. హారన్ మోగించాడు. అయినా ఆమెకు వినిపించలేదు. ఫలితం రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న హైదరాబాద్ నగర పోలీసులు ఇకపై పాదచారులే కాదు,  వాహనం నడిపేవారు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా చార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్లు, జైలు శిక్ష విధించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ విధానాన్ని అమలు పరిచి 192 మందిపై చార్జ్‌షీట్ దాఖలు చేశారు. త్వరలో సెల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేవారిపై కూడా చర్యలు తీసుకుంటామంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com