తుబ్లిలో కార్మికులకోసం ఐసిఆర్‌ఎఫ్ ఉచిత మెడికల్ క్యాంప్
- February 15, 2018
మనామా: ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ (ఐసిఆర్‌ఎఫ్), తుబ్లిలోని షట్‌డౌన్ మెయిన్‌టెనెన్స్ కంపెనీ కార్మికుల కోసం మెడికల్ క్యాంప్‌ని నిర్వహించనుంది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ క్యాంప్ నిర్వహించబడుతుందని నిర్వాహకులు తెలిపారు. సీనియర్ మెడికల్ కన్సల్టెంట్స్ ఈ క్యాంప్‌లో పాల్గొంటారు. 300 మందికి పైగా కార్మికులకు ఈ క్యాంప్ ద్వారా వైద్య సహాయం అందిస్తారు. ఐసిఆర్‌ఎఫ్ నిర్వహిస్తోన్న 123వ మెడికల్ క్యాంప్ ఇది. షట్‌డౌన్ మెయిన్‌టెనెన్స్ కంపెనీ ఉద్యోగులతోపాటు ఇతర కార్మికులకీ ఈ క్యాంప్ ఆహ్వానం పలుకుతోంది. ఐసిఆర్‌ఎఫ్ సోషల్ వర్కర్ పంకజ్ నల్లూర్ పంకజ్ మాట్లాడుతూ, ఇండియన్ ఎంబసీ సపోర్ట్‌తో తమ సంస్థ పలు కార్యక్రమాల్ని బహ్రెయిన్‌లో 2002 నుంచి నిర్వహిస్తోందని చెప్పారు. మొత్తం 122 క్యాంప&్స ద్వారా 41,600 మందికి పైగా కార్మికులకు వైద్య సేవలు అందించినట్లు చెప్పారాయన. యూరిన్ అల్బుమిన్ చెక్, కంప్లీట్ బాడీ చెకప్స్ వంటివి కూడా ఈ మెడికల్ క్యాంప్‌లో లభ్యమవుతాయి. వివిధ వ్యాధుల పట్ల అవగాహన కలిగించేలా వైద్యులు, కార్మికులకు సూచనలు సలహాలు అందిస్తారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







