సోహార్‌లో నలుగురు దుండగుల అరెస్ట్
- February 15, 2018
మస్కట్: రాయల్ ఒమన్ పోలీసులు ముగ్గురు ఒమనీయుల్ని, అలాగే ఓ వలసదారుడ్ని సోహార్‌లో అరెస్ట్ చేశారు. పోలీసు అధికారులపై దాడులకు పాల్పడటం, కిడ్నాప్ చేయడం, దొంగతనాలకు పాల్పడటం వంటి అభియోగాలపై వీరిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. నార్త్ అల్ బతినా పోలీస్ నేతృత్వంలోని క్రిమినల్ ఎఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ వివరాల్ని వెల్లడిస్తూ, దొంగతనం, దాడులు చేయడం, దోచుకోవడం వంటి నేరాభియోగాలు వీరిపై ఉన్నట్లు తెలిపింది. పోలీసుల తరహాలో వేషాలు మార్చుకుని, ఇళ్ళలోకి చొరబడి దొంగతనాలకు పాల్పడటం ఈ దుండగులకు నిత్యకృత్యమని పోలీసులు తెలిపారు. ఇన్వెస్టిగేషన్‌లో నిందితుల్ని గుర్తించిన పోలీసులు వారిని చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం వారి నుంచి నిజాల్ని చెప్పించారు. తదుపరి చర్యల నిమిత్తం ప్రాసిక్యూషన్‌కి అప్పగించనున్నారు నిందితుల్ని పోలీసులు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







