ప్రధాని నరేంద్ర మోడీ.. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ...?
- February 16, 2018
చాయ్‌పే చర్చతో దేశంలో కొత్త ట్రెండ్ సృష్టించిన ప్రధాని నరేంద్ర మోడీ.. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం పరీక్షాపే చర్చా కార్యక్రమంలో నిర్వహించారు. ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో జరిగిన చర్చాగోష్ఠికి భారీగా హాజరైన విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షల్లో ఒత్తిడిని ఎలా అధిగమించాలి అనే విషయంలో విద్యార్థులకు సూచనలు అందించారు.
పరీక్షలకు సన్నద్ధమవుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యమని ప్రధాని విద్యార్థులకు సూచించారు. యోగా ద్వారా ఏకాగ్రత సాధించవచ్చన్నారు. యోగా కేవలం శరీరం కోసమే కాదన్న ప్రధాని.. ఆసనాలు వేయడం ద్వారా మనసును కూడా ఉత్తేజితం చేయచ్చన్నారు. మనసు, బుద్ధి, శరీరం, ఆత్మను ఏకతాటిపైకి తెస్తే ఏకాగ్రత కుదురుతుందని విద్యార్థులకు తెలిపారు. యోగా ద్వారా ఏకాగ్రత సాధిస్తే పరీక్షల్లో విజయం సాధించవచ్చన్నారు.
విద్యార్థులు పరీక్ష ఒత్తిడిని ఎలా తట్టుకోవాలనేదానిపై ప్రధాని ఎగ్జామ్స్ వారియర్ అనే పుస్తకం రాశారు. దానిని ఇటీవలే మార్కెట్లో విడుదల చేశారు. ఇప్పుడు పరీక్షలు రాసే విద్యార్థుల కోసం స్వయంగా సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు భారీగా హాజరయ్యారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







