వరల్డ్ రికార్డ్: టీ20ల్లో ఆస్ట్రేలియా వరల్డ్ రికార్డ్

- February 16, 2018 , by Maagulf
వరల్డ్ రికార్డ్: టీ20ల్లో ఆస్ట్రేలియా వరల్డ్ రికార్డ్

ఆక్లాండ్‌ః టీ20 క్రికెట్‌లో ఆస్ట్రేలియా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన ట్రైసిరీస్ మ్యాచ్‌లో ఏకంగా 244 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి సంచలనం సృష్టించింది. కేవలం 18.5 ఓవర్లలోనే 5 వికెట్లు న‌ష్ట‌పోయి ఇంత పెద్ద లక్ష్యాన్ని చేజ్ చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 24 బాల్స్‌లోనే 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 59 రన్స్ చేశాడు. మరో ఓపెనర్ డాన్సీ షార్ట్ 44 బాల్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. వీళ్లకు తోడు మాక్స్‌వెల్ (14 బంతుల్లో 31), చివర్లో ఫించ్ (14 బంతుల్లో 36) మెరుపులు మెరిపించడంతో వరల్డ్ రికార్డు స్కోరు విజయవంతంగా ఛేదించగలిగింది. ఈ మ్యాచ్ మొత్తంలో 32 సిక్సర్లు నమోదు కావడం విశేషం. ఓ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డు సమమైంది. గతంలో టీ20ల్లో సక్సెస్‌ఫుల్ చేజ్ 236 పరుగులతో వెస్టిండీస్ పేరిట ఉంది. ఆసీస్ బ్యాట్స్‌మెన్ దెబ్బ‌కు కివీస్ బౌల‌ర్ వీల‌ర్ కేవ‌లం 3.1 ఓవ‌ర్ల‌లోనే 64 ప‌రుగులు ఇచ్చాడు.
అంతకుముందు ఓపెనర్ మార్టిన్ గప్టిల్ సెంచరీతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 243 పరుగులు చేసింది.

గప్టిల్ కేవలం 54 బాల్స్‌లో 9 సిక్సర్లు, 6 ఫోర్లతో 105 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ మన్రో (33 బంతుల్లో 76) కూడా చెలరేగిపోయాడు. మన్రో 6 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 132 పరుగులు జోడించారు.

వీళ్ల జోరు చూస్తూ న్యూజిలాండ్ టీ20ల్లో రికార్డు స్కోరు సాధించేలా కనిపించినా.. చివర్లో తడబడి 243 పరుగులకే పరిమితమైంది. ఈ సెంచ‌రీతో టీ20ల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రికార్డును కూడా గ‌ప్టిల్ త‌న పేరిట రాసుకున్నాడు. టీ20ల్లో గ‌ప్టిల్ 2188 ర‌న్స్ చేశాడు.

ఇప్ప‌టివ‌ర‌కు మెక‌ల్ల‌మ్ (2140) పేరు మీద ఉన్న రికార్డును అధిగ‌మించాడు. ఈ లిస్ట్‌లో కోహ్లి 1956 ప‌రుగుల‌తో మూడోస్థానంలో ఉన్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com