ముంబయి రౌడీలతో ప్రభుదేవా పోరాట సన్నివేశాల్లో చార్లిచాప్లిన్2
- February 16, 2018
చెన్నై, న్యూస్‌టుడే: ప్రభుదేవా, ప్రభు నటిస్తున్న కొత్త చిత్రం 'చార్లి చాప్లిన్ 2'. శక్తి చిదంబరం దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గతంలో కూడా ప్రభుదేవా, ప్రభు కాంబినేషన్‌లో పలు చిత్రాలు వచ్చాయి. వీటికి భిన్నంగా ఈ సినిమా ఉంటుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. నిక్కీగల్రాణి కథానాయిక. ఆదా శర్మ రెండో కథానాయికగా నటిస్తున్నారు. రవి మరియా, ఆకాశ్, వివేక్ ప్రసన్న, కావ్యాలు ఇతర తారాగణం. అమ్మా క్రియేషన్స్ బ్యానరుపై టి.శివ నిర్మాణంలోని ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. తెలుగులో గుర్తింపు పొందిన ఆదా శర్మ ఈ సినిమా ద్వారా కథానాయికగా తమిళంలో అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంతో ఆమె మరింత గుర్తింపు తెచ్చుకుంటుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. మార్చిలో పాటలను విడుదల చేయనున్నారు. ఈ చిత్రం గురించి శక్తి చిదంబరం మాట్లాడుతూ ఇది పూర్తిస్థాయి కమర్షియల్ కామెడీ సినిమా. ఆఖరి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది.
ఇటీవలే కుంభకోణంలో చిత్రీకరణ జరిపాం. 'మగధీర' ఫేమ్ దేవ్, ప్రభుదేవాల మధ్య జరిగే పోరాట సన్నివేశాలను తెరకెక్కించాం. ఇప్పుడు ముంబయి రౌడీలతో ప్రభుదేవా పోరాడే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఇందుకోసం రెండు పెద్ద సెట్‌లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







