చాకచక్యంగా పిల్లల్ని కాపాడిన..భారతీయ సంతతి మహిళ
- February 16, 2018
న్యూయార్క్ : అమెరికాలోని ఫ్లోరిడాలో అత్యంత పాశవికంగా మాజీ విద్యార్థి కాల్పుల సమయంలో శాంతి విశ్వనాథన్ అనే గణిత ఉపాధ్యాయురాలు చాకచక్యతను ప్రదర్శించి అనేక మంది పిల్లల ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళితే బుధవారం మధ్యాహ్నం పాఠశాల్లోని అలరామ్ రెండోసారి మోగిన వెంటనే కాల్పుల శబ్దం విన్న శాంతి తను బోధిస్తున్న తరగతి గది తలుపులను మూసివేశారు. వెంటనే పిల్లలందరినీ నేలపై పడుకోమని చెప్పి, కిటికీలను కూడా మూసివేసింది. ఇలా చేయడం వల్ల నిందితునికి అది ఖాళీ క్లాస్ రూంలా తోచి ఏమీ చేయకుండా వెళ్లిపోతాడన్న ఆలోచనతో ఆవిధంగా చేసిందని సన్ సెన్టైల్ పేర్కొన్నారు. ఆ తర్వాత పోలీసులు వచ్చి తలుపు తీయమన్నా తీయలేదని, తాను పోలీసునని చెప్పుకొని తలుపులు తీయించేందుకు ఉన్మాదినే ఈ విధంగా ట్రిక్స్ చేస్తున్నాడని భావించి తలుపు తీయలేదని పత్రిక పేర్కొంది. తలుపు బద్దలు కొట్టుకోండి లేదా కీ తో తలుపును తీసుకోండి, తాను మాత్రం తలుపు తీయనని తెలిపిందని పత్రిక వెల్లడించింది. ఆ తర్వాత పోలీసులు కిటికీలు ఓపెన్ చేయగా, పోలీసులని నిర్ధారించుకుని పిల్లలను బయటకు పంపించారు. ఆమె త్వరగా స్పందించి, చాలా మంది ప్రాణాలను కాపాడిందని ఒక విద్యార్థి తల్లి పత్రికా విలేకరులతో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







