వైజాగ్‌లో ఈ బండి ఎక్కితే నేలమీద, నీటిపై రయ్ రయ్...
- February 17, 2018
విశాఖకి మరో మణిహారం రాబోతుంది. గత నెలలో యుద్ధ విమానం, హెలీ టూరిజమ్‌ను అందుబాటులోకి తెచ్చిన పర్యాటక శాఖ.. ఇప్పుడు హోవర్ క్రాఫ్ట్‌ను సిద్ధం చేస్తోంది. నేల, నీటిపై రయ్ రయ్ మంటూ ఎంజాయ్ చేసే అవకాశాన్ని కల్పించబోతుంది. మార్చి నెలాఖరు నుంచి పర్యాటకులకు ఈ సేవలు అందుబాటులోకి రానుంది.
స్మార్ట్ సిటీగా ఎదుగుతోన్న విశాఖ.. పర్యాటక రంగానికి స్వర్గధామంగా మారుతోంది. బీచ్ సిటీగా.. దేశ, విదేశీ టూరిస్టులను ఆకర్షిస్తోంది. సహజ సిద్ధమైన అందాలతో పర్యాటకుల మనసు దోచుకుంటోంది. కైలాసగిరి, సబ్ మెరైన్, ఎర్రమట్టి దిబ్బలను చూసి ప్రకృతి ప్రియులు తన్మయత్వం చెందుతున్నారు. అటు ప్రభుత్వం కూడా.. పర్యాటకుల అభిరుచికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది.
నీలి సంద్రంలో కేరింతలు కొట్టేందుకు, కెరటాలతో ఆడుకునే అవకాశాన్ని.... పర్యాటకులకు కల్పించేందుకు ఏపీ టూరిజం శాఖ హోవర్ క్రాఫ్ట్‌లు సిద్ధం చేస్తోంది. తీరం నుంచి రెండు కిలోమీటర్ల మేర సముద్రం లోపలికి వెళ్లి చక్కర్లు కొట్టేలా హోవర్ డాక్‌కు చెందిన రెండు హోవర్ క్రాఫ్ట్‌లను విశాఖ తీసుకొచ్చింది. ప్రస్తుతం సన్ రే రిసార్ట్స్ సమీపంలో ఉంచి పైలెట్లకు శిక్షణ ఇస్తోంది. మార్చి నెలాఖరు నాటికి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానుంది.
విశాఖలోని గోకుల్ పార్క్ సమీపంలో హోవర్ డాక్ సంస్థకు జీవిఎంసీ 4వేల గజాల స్థలాన్ని లీజుకు ఇచ్చింది. ఇప్పటికే అన్ని అనుమతులు మంజూరు చేసింది. హోవర్ క్రాఫ్ట్ లో ప్రయాణించేందుకు 300 నుంచి 500రూపాయలు చార్జ్ చేసే అవకాశముంది. త్వరలోనే ధరలు ఖరారు చేయనుంది.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







