భారీగా తగ్గిన వెండి ధర...స్థిరంగా పసిడి
- February 17, 2018
వెండి ధర భారీగా పడిపోయింది. కేజీ వెండి ధర రూ.40వేల దిగువకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో శనివారం నాటి ట్రేడింగ్‌లో కేజీ వెండి ధర రూ.500 తగ్గి రూ.39,800కి చేరింది. బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. పది గ్రాముల పసిడి ధర రూ.31,250 వద్ద స్థిరంగా ఉందిఅంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ తగ్గడంతో పాటు వ్యాపార వర్గాలు, నాణేల తయారీ దారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో వెండి ధర పడిపోయిందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు తగ్గాయి. న్యూయార్క్ మార్కెట్లో వెండి ధర 3.63శాతం తగ్గి ఔన్సు వెండి ధర 16.58 డాలర్లుగా ఉంది. బంగారం ధర 1.22శాతం తగ్గి ఔన్సు బంగారం ధర 1,331.90డాలర్లుగా ఉంది.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







