బాలీవుడ్‌ మెరుపులు విదేశీ హంగులు తో 'సాహో'

- February 22, 2018 , by Maagulf
బాలీవుడ్‌ మెరుపులు విదేశీ హంగులు తో 'సాహో'

'బా హుబలి' తరవాత ప్రభాస్‌ సినిమా అంటే... ఏ స్థాయిలో ఉండాలి? ఎన్ని హంగులు పొందుపరచాలి? ఎంత హంగామా చేయాలి?... ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే 'సాహో' రూపొందుతోంది. ప్రభాస్‌ కథానాయకుడిగా యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. సుజిత్‌ దర్శకుడు. బాలీవుడ్‌ భామ శ్రద్ధా కపూర్‌ కథానాయిక. నీల్‌ నితిన్‌ ముఖేష్‌ ప్రతినాయకుడిగా నటిస్తారు. ఇటీవల హైదరాబాద్‌, ముంబయిలలో కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. వచ్చే నెలలో చిత్రబృందం దుబాయ్‌ వెళ్లనుంది. అక్కడ కీలక సన్నివేశాల్ని తెరకెక్కించిన తరవాత అటు నుంచి అటే... యూరప్‌ వెళ్తారు. దాదాపు నలభై రోజుల పాటు విదేశాల్లోనే 'సాహో' చిత్రీకరణ కొనసాగబోతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హిందీ మార్కెట్‌ని దృష్టిలో ఉంచుకుని నటీనటులు, సాంకేతిక నిపుణుల్లో సగానికి పైగా అక్కడి వారినే దిగుమతి చేసుకున్నారు. ఈ చిత్రానికి శంకర్‌ - ఎహసాన్‌ - లాయ్‌ సంగీతం అందిస్తున్నారు. జాకీష్రాఫ్‌, మహేష్‌ మంజ్రేకర్‌, మందిరాబేడీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com