4 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నేపాల్ యువకుడు
- March 02, 2018
దుబాయ్: అభం శుభం తెలియని ముక్కుపచ్చలారని పసిపిల్లపై అకృత్యానికి పాల్పడ్డాడా నేపాల్ యువకుడు. 24 ఏళ్ల వయస్సు గల ఆ కామాంధుడు దుబాయ్ నగరంలోని ఓ ప్రాంతంలో క్లినర్‌గా పనిచేస్తున్నాడు. తాను నివసిస్తున్న అపార్ట్మెంట్ సమీపంలో ఒంటరిగా కనిపించిన ఓ నాలుగేళ్ల బాలికను ఓ ఫ్లోట్లోకి తీసుకెళ్లి తలుపులు మూశాడు. నిందితుడు తన దుస్తులన్నీ విప్పేసి బాలికను ఎక్కడెక్కడో అసభ్యకరంగా తాకాడు. అసభ్యకర రీతిలో ముద్దులు పెట్టాడు. అనంతరం తలుపులు తెరవడంతో బాలిక అక్కడి నుంచి ఇంటికి పరుగుతీసింది. తన తల్లిని చూసి ఏడ్చింది. కానీ జరిగిన విషయం చెప్పలేకపోయింది. రాత్రి నిద్రిస్తున్న సమయంలో సైతం బాగా ఆందోళన చెందింది. మళ్లీ నిందితుడు ఏమైనా చేస్తాడేమోనని విపరీతమైన ఆందోళనకు గురైంది. కానీ తల్లితో చెప్పలేదు. మరుసటి రోజు స్కూల్ నుంచి తల్లితో కలిసి ఇంటికి వస్తున్న సమయంలో నిందిత యువకుడు కనిపించడంతో కంగారు పడి జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. విషయం తెలుసుకున్న తల్లి నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వారు అపార్ట్మెంట్ లో సీసీ కెమేరాలలో పరిశీలించగా నిందిత యువకుడు బాలికను తీసుకెళ్తున్నట్టు సి సి ఫుటేజ్ లో నమోదైంది. బాలిక చెప్పిన విషయాలన్నీ సరిపోలాయని పోలీసులు తెలిపారు. ఈ కేసుపై కోర్టులో విచారణ ప్రారంభైమనట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్‌లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్‌లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్‌లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్‌లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







