ప్రిన్స్ మహేష్ బాబు 25వ చిత్రానికి సన్నాహాలు..
- March 02, 2018
మహేష్‌బాబు కథానాయకుడిగా రూపొందుతున్న భరత్ అనే నేను చిత్రం చిత్రీకరణ తుది దశకు చేరుకోవడంతో ఆయన నటించనున్న 25వ చిత్రానికి మరోవైపు సన్నాహాలు వేగవంతమయ్యాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్ పతాకాలపై సి.అశ్వనీదత్, దిల్‌రాజులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కె.యు.మోహనన్ పనిచేయనున్నారు. బాలీవుడ్లో 2006లో వచ్చిన డాన్ చిత్రానికి, అలాగే తలాష్, రయీస్ వంటి భారీ చిత్రాలకు అద్భుతమైన విజువల్స్‌ని మోహనన్ అందించారు. మహేష్‌బాబు సరసన పూజాహెగ్డే నాయికగా నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కథ: వంశీ పైడిపల్లి, హరి, సాల్మన్, సినిమాటోగ్రఫీ: కె.యు.మోహనన్, నిర్మాతలు: సి.అశ్వనీదత్, దిల్‌రాజు, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







