ఘనంగా ప్రారంభమైన ఆస్కార్ అవార్డుల వేడుక
- March 04, 2018
90వ అకాడమీ అవార్డుల వేడుక మొదలైంది. లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్లో జరుగుతున్న ఈ వేడుకకు హాలీవుడ్ మేటి నటులందరూ తరలివచ్చారు. రెడ్ కార్పెట్ పై హొయలు పోయారు.. మొదట బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు ప్రకటించారు. ఈ అవార్డును త్రీ బిల్ బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి మూవీకి శామ్ రాక్వెల్ అందుకున్నారు.
ఆస్కార్ బెస్ట్ హెయిర్ స్టైల్ అండ్ మేకప్ విభాగంలో డార్కెస్ట్ అవర్ అకాడమీ అవార్డు అందుకుంది. ఇక ఫాంటమ్ థ్రెడ్ మూవీకి తరఫున బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ పురస్కారాన్ని మార్క్ రిజెస్ అందుకున్నారు. బెస్ట్ డాక్యుమెంటరీ పీచర్గా ఇకరస్ మూవీ అకాడమీ అవార్డు అందుకుంది. బెస్ట్ సౌండ్ ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్ విభాగాల్లో డన్క్రిక్ మూవీకి ఆస్కార్ పురస్కారాలు దక్కాయి. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో ద షేప్ ఆఫ్ వాటర్ మూవీకి ఆస్కార్ లభించింది.
ఈసారీ ఆస్కార్ బరిలో ది షేప్ ఆఫ్ వాటర్ మూవీ అత్యధికంగా 13 విభాగాల్లో వామినేషన్ దక్కించుకుంది. ఆ తర్వాత త్రీ బిల్ బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి సినిమా 9 విభాగాల్లో, డన్క్రిక్ 7 విభాగాల్లో నామినేషన్లను దక్కించుకున్నాయి. ఈ మూడు సినిమాలు ఉత్తమ చిత్రం కేటగిరీలో కూడా ఉన్నాయి. మిగిలిన వాటిలో ‘కాల్ మి బై యువర్ నేమ్’, ‘డార్కెస్ట్ అవర్’, ‘గెట్ అవుట్’, ‘ది ఫాంటమ్ థ్రెడ్’, ‘ది పోస్ట్’ మూవీస్ ఉన్నాయి. చిత్రాలు ఉన్నాయి.
ఉత్తమ దర్శకుల విభాగంలో ఐదుగురు పోటీపడుతున్నారు. ఫాంటమ్ థ్రెడ్ దర్శకుడు పాల్ థాస్ ఆండ్రసన్, ది షేప్ ఆఫ్ వాటర్, లేడీబర్డ్, గెటవుట్ సినిమా దర్శకులు బరిలో ఉన్నారు. డ్రంకిక్ సినిమా కోసం ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ ఈసారీ ఉత్తమ దర్శకుడి విభాగంలో నామినేట్ అయ్యారు.
ఈసారీ అకాడమీ వేడుకల్లో ఉత్తమ నటుడి విభాగంలో తిమోటీ చాల్మెంట్ కాల్ మి బై యువర్ నేమ్ మూవీ కోసం పోటీపడుతుండగా.. గ్యారీ ఓల్డ్ మాన్ డార్కెస్ట్ అవర్ కోసం ఆస్కార్ బరిలో నిలిచారు. వీరితోపాటూ ఫాంటమ్ థ్రెడ్ హీరో డానియల్ డే ల్యూనిస్, గెటవుట్ హీరో డానియల్ కాలూయా, డెన్జిల్ వాషింగ్టన్ బెస్ట్ యాక్టర్ పురస్కారం అందుకోడానికి పోటీపడుతున్నారు.
ఇక ఉత్తమనటి ఆస్కార్ కోసం ది షేప్ ఆఫ్ వాటర్ , త్రీ బిల్ బోర్డ్స్, ఐటోన్యా, లేడీబర్డ్ హీరోయిన్లు ఉన్నారు. వీరితోపాటూ ది పోస్ట్ సినిమాలో నటించిన మెర్లీ స్ట్రీప్ కూడా ఆస్కార్ అందుకోడానికి పోటీపడుతున్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







