జెడ్డా నుంచి వచ్చిన పిల్లి.. కొచ్చి విమానాశ్రయంలో నిర్బంధం!
- March 04, 2018
కేరళ:గల్ఫ్ నుంచి తెచ్చిన పెంపుడు పిల్లిని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు పట్టుకున్నారు. జెడ్డా నుంచి వస్తూవస్తూ ఓ భారత జంట వెంట పెంపుడు పిల్లిని తెచ్చుకున్నారు. మార్చి 2న వీరు సౌదీ ఎయిర్‌లైన్స్‌లో కొచ్చి చేరుకున్నారు. వెంట పిల్లి ఉండడాన్ని గమనించిన కస్టమ్స్ అధికారులు దానిని స్వాధీనం చేసుకుని నిర్బంధించారు. ఈ విమానాశ్రయంలో పెంపుడు జంతువులను తెచ్చుకునే విషయంలో నిషేధం ఉండడంతో వారు వెంటనే సౌదీ ఎయిర్‌లైన్స్‌కు సమాచారం అందించారు. పిల్లిని భారత్‌కు తెస్తున్నట్టు ఎటువంటి డాక్యుమెంట్లు లేకపోవడంతో పిల్లిని తిరిగి జెడ్డాకు పంపాలని కోరారు.
పెంపుడు జంతువులను తెచ్చుకోవాలంటే, ఆయా దేశం నుంచి దాని హెల్త్ సర్టిఫికెట్ కూడా తెచ్చుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల్లో మాత్రమే పెంపుడు జంతువులను అనుమతిస్తారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







