వచ్చే ఎన్నికల్లో బరిలోకి :సుమన్

- March 04, 2018 , by Maagulf
వచ్చే ఎన్నికల్లో బరిలోకి :సుమన్

 ప్రముఖ సినీ నటుడు సుమన్ నేడు, శనివారం తాను  ఎన్నికల బరిలో దిగుతున్నట్టు  ప్రకటన చేశారు. ఓ ప్రవేటు  కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒంగోలు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్టు తెలిపారు. అయితే తాను ఏ పార్టీలోకి వెళ్తానన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేనని, రాజకీయ ప్రవేశం మాత్రం పక్కా అని తేల్చి చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే పార్టీలోకి వెళ్లడమో, ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయడమో చేస్తానని వివరించారు. ఒక దశాబ్దం క్రితం ఆయన బీజేపీ మద్దతు దారుడిగా ఆంధ్రప్రదేశ్ లో మిత్రుడు భానుచందర్ తో కలసి ప్రచారం చేసాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com